ఘనంగా రాములోరి కల్యాణం


Sat,April 13, 2019 11:50 PM

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రిలో సీతారామచంద్రస్వామి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. భద్రాచలం కంటే ఒక రోజు ముందుగా యాదాద్రి కల్యాణోత్సవం నిర్వహించారు. వారం రోజులుగా జరుగుతున్న రాములోరి నవరాత్రి వేడుకలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రామునిగా భూలోకంలో అవతరించి మానవ జీవితం ఎలా ఉండాలో..సార్థ్ధకత ఎలా సాధించాలో తెలియజెప్పిన అవతారంగా భక్తులు భావిస్తారు. సకల గుణాభిరాముడు రాముని కల్యాణోత్సవాన్ని ప్రజలు పండుగగా జరుపుకున్నారు. యాదాద్రిలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో భక్తులు అధి సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అనువంశికధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ఈవో గీత సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రామలింగేశ్వరాలయ ఉప ప్రధానార్చకులు గౌరీభట్ల నర్సింహరాములశర్మ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణతంతు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...