కల్యాణం.. కమనీయం


Sat,April 13, 2019 11:49 PM

- పలు ఆలయాల్లో సీతాశ్రీరామచంద్రస్వామి కల్యాణం

భూదాన్‌పోచంపల్లి : శ్రీరామ నవమిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వరస్వామి దేవాలయంలో శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో గత 40 ఏండ్లుగా కర్నాటి పెద్ద నర్సింహ కుమారుల ఆర్థిక సహకారంతో కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కర్నాటి ధనుంజయ్య, బాలయ్య, వెంకటేశం దంపతులు స్వామి, అమ్మవారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించగా.. వేదపండితుల కల్యాణ తంతును కనులపండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కడవేరు రాములు, ధర్మకర్తలు భారత బాలకిషన్, భోగ స్వామి, భోగ బాల్‌నర్సింహ, వసంత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సీతారామచంద్రస్వామి దేవాలయంలో ధ్వజరోహణం
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాతం, విఘ్నేశ్వరపూజ, స్వస్తివాచనం, దీక్షాధారణ, ధ్వజారోహణం, దేవతాహ్వానం, అఖండ దీపారాధన, మూవర్యులకు అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివారం గాంధీపార్క్‌లో ఉదయం 11.30 గంటలకు సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం, సాయంత్రం రథం ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీశైలంగౌడ్ కాసుల వెంకటేశ్‌గౌడ్, ఊడుగు మల్లేశ్‌గౌడ్, నల్ల పర్వతాలు యాదవ్, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, పోలోజు శ్రీనివాస చారి, చింతల తిరుమల్‌రెడ్డి, ఊడుగు అర్చన శ్రీనివాస్‌గౌడ్, దాడి పద్మసురేందర్‌రెడ్డి, దాచెపల్లి ప్రకాశ్‌గుప్తా, గుజ్జుల సురేందర్‌రెడ్డి, పల్చం రాములు, వెన్‌రెడ్డి రాజు, మంచికంటి భాస్కర్‌గుప్తా, చిరందాసు దనుంజయ్య , ఎంపీటీసీ గోశిక సుమతి, రైతు సమన్వయ సమితీ జిల్లా మెంబర్ చింతల దామోదర్‌రెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి,అన్నమోని గోవిందరాజు పాల్గొన్నారు.

ఆంజేయస్వామి దేవాలయంలో..
ఆలేరుటౌన్ : ఆలేరు పట్టణంలోని బొడ్రాయి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం అశేష భక్తజనం సమక్షంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు శ్రీరామచంద్రస్వామి తరపున దూడల బాలమణి చంద్రమౌళిగౌడ్ దంపతులు, పెళ్లికూతురు సీతాదేవి తరపున గనగాని లక్ష్మీశంకర్‌గౌడ్, గనగాని సుజాత రాంచందర్‌గౌడ్, గనగాని స్వప్నసంపత్‌గౌడ్ దంపతలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఆలేర్ రంగన్న పంతులు పూజారిగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో భక్తులు తోకల అమరసింహారెడ్డి, ఎలగల రాము, సీస శ్రీనివాస్‌గౌడ్, బందెల సుభాశ్, బోడ సతీశ్‌కుమార్, నామాల ఎల్లేశ్, గంగేశ్, శివ, రంజిత, మంత్రి భాస్కర్, నామాల వెంకటేశ్, వీరస్వామి, మాణిక్యాల నవీన్, జింకల భరత్, పొరెడ్డి శ్రీనివాస్, మెరిగాడి ఇందిర, సీస మహేశ్వరి, వంగరి రమాదేవి, కట్టెగొమ్ముల మమత, రాయిగిరి సోమలక్ష్మి, సీస లక్ష్మి, ఎలగల వనిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...