ఉపాధిహామీ పనులు ప్రారంభం


Sat,April 13, 2019 01:15 AM

బొమ్మలరామారం : ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన వంద రోజుల పనిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాగినేనిపల్లి సర్పంచ్ బట్కీర్ బీరప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని నాగినేనిపల్లిలో చేపట్టిన ఉపాధిహామీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టే నీటి గుంతలు, కాల్వల ఏర్పాటు, చెట్లు ఏరివేత, భూమి లెవలింగ్ వంటి పనులను చేపట్టినట్లు తెలిపారు. రైతులు ఎవరైనా వీటిని ఏర్పాటు చేసుకోవాలంటే తమ భూమి పట్టాపాస్ బుక్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్‌కు పనికోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాంరెడ్డి, నాయకులు సత్యనారాయణ, రేసు రాంరెడ్డి, మహేందర్, కృష్ణ, ఉపేందర్, నర్సింహ, వెంకటేశ్, ఉపాధికూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.
గుండాల : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పనులను మండలంలోని అంబాలలో శుక్రవారం గ్రామ సర్పంచ్ యాస భాషిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వలసలను నివారించడం కోసం ప్రభుత్వం ఉపాధిహామీ పనులను కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఉపాధికూలీలు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...