కొలిచినవారికి కొంగుబంగారం


Sat,April 13, 2019 01:15 AM

లింగాలఘనపురం : శ్రీరామనవమికి నవాబుపేట మండలంలోని శ్రీకోదండరామస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది. ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

స్థ్ధల పురాణం..
కొలిచినవారికి కొంగు బంగారంగా శ్రీ కోదండరామస్వామి వెలుగొందుతున్నాడు. నవాబుల హయాంలో రాణీ మాలతీబాయి ఈ ప్రాంతాన్ని పాలించి, నవాబులకు శిస్తు వసూల చేసి ఇస్తూ, నవాబుపేటలో కోటనిర్మించుకున్నది. ఈ క్రమంలో శ్రీరాముడు ఆమె కలలోకి వెళ్లి గుడి కట్టించాలని ఆదేశించడంతో ఆమె 1913లో గుడి నిర్మించడంతోపాటు అనుసంధానంగా పశువుల సంతను ఏర్పాటు చేసింది. దేవాదాయశాఖ పరిధిలోకి ఆలయం చేరినప్పటికీ ఆలయ కమిటీ చైర్మన్‌పదవి వంశపారంపర్యంగా రాణి సంతతికే దక్కుతున్నది. రాణి కుమారుడు సురేశ్‌బాబు ప్రస్తుతం ఆలయకమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆలయానికి నవాబుపేటలో 13 ఎకరాల భూమి, వడిచర్లలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. పశువుల సంత ద్వారా ఈ సంవత్సరం రూ.78.05 లక్షల ఆదాయం సమకూరింది. డక్కా వేలం (పశువులను వాహనాల్లోకి చేర్చే మట్టి దిబ్బలు) ద్వారా అదనంగా రూ.9 లక్షలు, పగ్గాల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.1.60 లక్షల ఆదాయం సమకూరింది. ఉగాది పర్వ దినాన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగగా, ఈ నెల 17 వరకు జాతర కొనసాగనున్నది. జాతరలో కీలకమైన ధ్వజారోహణ, గరుడ ముద్ద, దేవతాహ్వానం, భేరీ పూజ ఎదుర్కోలు ఈ నెల 13న నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో వేసిన చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేసిన తాత్కాలిక కల్యాణ వేదికపై శ్రీకోదండరామస్వామి, సీతాదేవిల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కల్యాణోత్సవానికి కుందారం, వడిచర్ల, వనపర్తి, చీటూరు, కిష్టగూడెం తదిర గ్రామాల నుంచి భక్తులు తరలి రానున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...