పూలే ఆశయసాధనకు కృషి చేయాలి


Fri,April 12, 2019 12:35 AM

అడ్డగూడూరు : మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. గురువారం ధర్మారం గ్రామంలో జ్యోతీరావుపూలే 192 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ఆర్థికంగా అభివృద్ధి సాధించి అసమానతలు తొలగిపోతాయని మహాత్మా జ్యోతీరావు పూలే తన భార్య సావిత్రీ పూలేకు విద్యను నేర్పించి, సమాజ మార్పుకు అంటరాని తనం రూపు మాపేందుకు కృషి చేశాడన్నారు. ఇప్పటికీ ఇంకా కొన్ని గ్రామాల్లో ప్రజలు అక్షర జ్ఞానం లేక విజ్ఞానం పొంద లేక సమాజానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని చైతన్యం చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. విద్యతోనే సమస్యలు తొలగిపోయి, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అంటరానితనం అసమానతలు తొలిగిపోతాయన్నారు. కుల, మత వర్గాల మధ్య తేడా లేదన్నారు. ప్రజల్లో వ్యక్తిత్వ, మతతత్వ తారతమ్యాలతో సమూల మార్పు జరుగటం లేదన్నారు. ప్రజలంతా ఒక్కతాటిపై నిలిచి అందరికి విద్య, రాజ్యాధిక్కార సాధించే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెల మహనీయులు పుట్టిన నెల అని అన్నారు. తన భార్య సావిత్రిబాయిపూలే చదువు నేర్పి దళితుల వాడలోకి వచ్చి దళితులకు చదువు నేర్పించడన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన బాటలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శీలం జ్యోతి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శీలం దావిద్, మందుల నర్సింహ, లక్ష్మణాచారి, రమేశ్ పాల్గొన్నారు.

బీసీ సంఘం ఆధ్వర్యంలో ..
మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి మండలా ధ్యక్షుడు తుప్పతి బీరప్ప ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 192వ జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ప్రతి ఒక్కరూ ఆయన ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కూరాకూల వెంకన్న,బండి వెంకన్న, అసర్ల వీరస్వామి, నారబోయిన వెంకటేశం, పాక సింహాద్రి, కడారి రమేశ్, కంచి బుచ్చయ్య, బాలెంల సైదులు, బాలెంల పరుశురాములు పాల్గొన్నారు.

ఘనంగా జ్యోతిరావుపూలే జయంతి
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : పట్టణంలో కాంగ్రెస్ నాయకులు జ్యోతిరావుపూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని నినదించారు. కార్యక్రమంలో చింతల వెంకట్‌రెడ్డి, తిరుపతి రవీందర్, పాలడుగు వెంకన్న, పల్చం సత్యం, ఆవుల ఏసు, మలిగె మల్లేశ్ పాల్గొన్నారు.

రామన్నపేట : మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నకిరేకంటి నాగరాజు మాదిగ రిసెర్చ్ స్కాలర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఖానవళి ప్రాంతంలో యాదవ కులానికి చెందిన కుటుంబంలో జ్యోతిరావు పూలే జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు కానీ క్రమేణా పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలే గా మార్పు చెందింది అన్నారు. శూద్రులను బ్రాహ్మణ చెర నుంచి కాపాడాలనే ఆయన 1873 సెప్టెంబర్ 24న సత్యశోధన సమాజాన్ని స్థాపించారు. గులాంగిరి ( బానిసత్వం) పుస్తకాన్ని రచించారు. విగ్రహారాధనను ఖండించారు. స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షతను ఫూలే విమర్శించారు. కార్యక్రమంలో నల్ల స్వామి మాదిగ, దేవేందర్ మాదిగ, నకిరేకంటి సురేష్, నర్సింహ, బొడ్డు నవీన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...