శ్రీవారి ఖజానాకు రూ.6,76,416 ఆదాయం


Fri,April 12, 2019 12:35 AM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామిఅమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. తర్వాత భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం జరిగాయి. కొండపైన గల పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకు లు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సామూహిక సత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. వ్రత పూజల ద్వారా రూ.39,000ల ఆదాయం సమకూరింది. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానా లెక్కింపు..
శ్రీవారి ఖజానాకు రూ. 6,76,416 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.90, 374, 100 రూపాయల టికెట్‌తో రూ.40,000, కల్యాణకట్ట ద్వారా రూ. 22,000, గదులు విచారణ శాఖతో రూ. 13,750, ప్రసాదవిక్రయాలతో రూ.2,65,885, శాశ్వత పూజలతో రూ.46,464 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...