పోలింగ్ కేంద్రాల సందర్శన


Fri,April 12, 2019 12:35 AM

తుర్కపల్లి : మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 39 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 84.61 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది వికలాంగులు, వృద్ధులను ట్రై సైకిళ్ల పై పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లారు. తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, గొల్లగూడెంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్ తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

గంధమల్ల, ఇంద్రానగర్, వీరారెడ్డిపల్లి, తిర్మలాపూర్, వాసాలమర్రి, మల్కపూర్, మాదాపూర్‌ల్లో పోలింగ్ కేంద్రాలను గురువారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సందర్శించారు.ఓటింగ్ ఎలా జరుగుతుంది. ఓటింగ్‌సరళి ఏమిటని ఆరా తీశారు. మండల కేంద్రంలోని చిరుధాన్యాల పలహార శాలలో కాసేపు గడిపారు. రాగిజావ సేవించి ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు.

రాజాపేట : పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభజనం కొనసాగిందని, మరోమారు భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అఖండ విజయం ఖాయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ వద్ద ఓటింగ్ సరళిని టీఆర్‌ఎస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో గులాబీ పార్టీ హవానే కొనసాగిందని, సీఎం కేసీఆర్ ఢిల్లీ పీఠం శాసించే స్థాయికి ఎదుగనున్నారన్నారు. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల సర్కారే అధికారంలోకి వచ్చి సీఎం సూచించి వ్యక్తే ప్రధాని అవుతారన్నారు. కేంద్రంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించనుండడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాశేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాతో తప్పక వస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయాలు నిధులు కేటాయింపుతో మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగి దేశంలో నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తుందన్నారు. మరోసారి అభివృద్ధికే వైపే మోగ్గు చూపి సారు.. కారు.. పదహారు .. ఢిల్లీ సర్కార్.. అనే నినాదంతో టీఆర్‌ఎస్‌కి మద్దతు పలికిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమె వెంట టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఈశ్వరమ్మాశ్రీశైలం, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు, ఆలేరు మార్కెట్ డైరెక్టర్ గుర్రం నర్సింహులు, టీఆర్‌ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు ఆడేపు రమాదేవి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సట్టు తిరుమలేశ్, ఎడ్ల బాలలక్ష్మి, దాచపల్లి శ్రీనువాస్, అంకతి బాలయ్య, కాలె సుమలత, కూతురు లింగం, ఎర్రగోకుల రాజు, రాజయ్య, సిద్ధులు ఉన్నారు.

పోలింగ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి
రామన్నపేట : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సరళిని నకిరేకంటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేంద్రాలను పరిశీలించారు. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యాన్ని ఆయన టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపుకోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పోలింగ్ సరళి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ధన్యవాదాలు తెలిపారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికల సరళిని ఆయన టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బూర గెలుపుకు ప్రచారంలో సహకరించిన ప్రతి నాయకుని, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...