ప్రశాంతంగా పోలింగ్


Fri,April 12, 2019 12:34 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఎలక్షన్ సెంట్రల్ అబ్జర్వేటర్ అమిత్‌కుమార్ గురువారం సందర్శించారు. ఎన్నికల నిర్వాహణపై ఆరా తీశారు. ఈవీఎంల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ సూచనలను పాటించాలని తెలిపారు. ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్నారు. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు.

చౌటుప్పల్ రూరల్ : లోక్‌సభకు గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 82.52 పోలింగ్‌శాతం నమోదైంది. మండలవ్యాప్తంగా 68 పోలింగ్ కేంద్రాల్లో 55,938 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 46,164 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలవ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏసీపీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 158 పోలీసు బలగాలు ్ల విధులు నిర్వర్తించారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతగా జరుగుతున్నాయని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. గురువారం పంతంగిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి ఓటువేశారా అని ఆరాతీశారు. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సిబ్బందికి తెలిపారు. జిల్లాలో 75 సమస్యాత్మాక గ్రామాలు ఉన్నాయయని 145 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

మోత్కూరు: ఎన్నికలు తుంగతుర్తి నియోజకవర్గంలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేయడానికి ఉదయం 7 గంటల నుంచి బారులు తీరారు. మండలంలోని అక్కడక్కడ ఈవీఎం ప్యాట్‌లు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా ఓటింగ్ జరిగింది. ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. తిరుమలగిరి పరిధిలోని మాలిపురంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్-కమల దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దత్తప్పగూడెంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్సై హరిప్రసాద్ పోలీసు గస్తీని ముమ్మరం చేశారు.
మోత్కూరు, అడ్డగూడూరు, తుంగతుర్తి, తిర్మలగిరి, అర్వపల్లి, మద్దిరాల, శాలిగౌరాంర నాగారం మండలాల్లో ని పలు గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ సరళిని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బూరనర్సయ్య గౌడ్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. నియోజక వర్గంలో 69.13 శాతం పోలింగ్ నమోదైంది. మంత్రి జగదీశ్‌రెడ్డి అర్వపల్లి ,తుంగతుర్తి,మద్దిరాల మండలాల్లో సందర్శించగా బూరనర్సయ్యగౌడ్ అర్వపల్లిలో పోలింగ్ కేంద్రాలను సందర్శిచారు. మోత్కూరు మండలంలోని 30 పోలింగ్ కేంద్రాల్లో మండలంలోని గ్రామాలకు 24,775 మంది ఓటర్లకుగానూ 18,707 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 75శాతం పోలింగ్ నమోదైనట్లు మండల రిటర్నింగ్ అధికారి వి. యాదాబాయి తెలిపారు.

అడ్డగూడూరు : తుంగతుర్తి నియోజకవర్గంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలకేంద్రంలో 56వ బూత్‌లో ఈవీఎం, కంచపపల్లి 60, చౌళ్లరామారం గ్రామంలోని కాసేపు మోరాయించడంతో టెక్నిషియన్లు వచ్చి సమస్యను పరిష్కారం చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ తన స్వగ్రామమైన ధర్మారంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీపీ ఓర్సు లక్ష్మి మండలంలోని చిన్నపడిశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 21038 ఓటర్లు ఉండగా 15391 ఓట్లు పోలయ్యాయి. అందులో మహిళలు 7549, ఓట్లు పోల్‌కాగా, పురుషులు 7842 ఓట్లు పోలయ్యాయి. మండల వ్యాప్తంగా 73 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ ఎండీ సలిమొద్దీన్ తెలిపారు.
సంస్థాన్‌నారాయణపురం: పార్లమెంట్ ఎన్నికలు మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసినవి. మొత్తం 54 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 34387 మంది ఓటర్లు ఉండగా అందులో 27722 మంది ఓటు వినియోగించుకోగా 80.61 శాతం ఓట్లు పోలైనవి. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. మధ్యాహ్నం కొంత ఓటింగ్ సరళి తగ్గినప్పటికీ సాయంత్రం 4 గంటల నుంచి ఓటింగ్ శాతం పెరిగింది. పోలింగ్ కేంద్రాలను డీసీపీ కె.నారాయణరెడ్డి సందర్శించి పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు సహకరించాలని ఓటర్లకు సూచించారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జడ్పీటీసీ శివవంకర్, సర్పంచ్ శ్రీహరి దంపతులు, లింగవారిగూడెంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయసమితి సభ్యులు, పార్టీ కార్యకర్తలు పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రామన్నపేట : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను రాచకొండ కమిషనరేట్‌లోని డీసీపీ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 80 మొబైల్ రూట్ టీంలు, 750 పోలింగ్ సిటింగ్‌లు, 75 సమస్యాత్మక పోలింగ్ భధ్రత, 140 పోలింగ్ కేంద్రంలో సిబ్బందిని ఏర్పాట్లు చేశామన్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘనటలు జరుగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి భద్రత తీసుకుందని తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎస్సై సాయిలు, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలున్నాయి. మండలకేంద్రంలోతహసీల్దార్ బ్రహ్మయ్య ఎన్నికలు జరుగు ప్రదేశాలను సందర్శించారు. 24 గ్రామాలకు గాను మొత్తం ఓట్లు 42,262 ఉండగా. 32,081 పోలైనవి. పురుషులు 21,440 ఉండగా 16,506 ఓట్లు పోలైనవి. మహిళలు 20,822 ఉండగా 15,575 ఓటు వినియోగించుకోగా 75.91 శాతం ఓట్లు పోలైనవి. దీనిలో వికలాంగులు 493 ఓట్లు పోలైనవని ఆయిన తెలిపారు. మండల వ్యాప్తంగా 59 పోలింగ్ బూత్‌ల్లో 148 మంది సిబ్బంది హాజరైనార తెలిపారు. కార్యక్రమంలో డీటీ ఇబ్రహీం పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...