ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు


Fri,April 12, 2019 12:34 AM

భూదాన్‌పోచంపల్లి : పార్లమెంట్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మండల వ్యాప్తంగా 49 పోలింగ్ బూత్‌ల ద్వారా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 39,435 ఓట్లకుగాను 33,849 ఓట్లు పోల్ అయ్యాయి. భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో 85.83 శాతం ఓట్లు భూదాన్‌పోచంపల్లి మండలంలో పోల్ అయ్యాయి. ఎన్నికల సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పరిశీలించగా.. కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు జకీర్ హుస్సేన్ స్వయంగా పోచంపల్లి మండల కేద్రంలోని పలు బూత్‌ల్లో నిర్వహిస్తున్న ఎన్నికలను పరిశీలించారు. కాగా ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్.. ఈవీఎం ప్యాడ్లు మొరాయించడంతో జగత్‌పల్లితోపాటు మండల కేంద్రంలోని 163 బూత్‌లో గంటసేపు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మందకోడిగా పోలింగ్ జరుగగా.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ భారీగా పెరిగింది. అయితే ఎక్కుడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సరళిని తెలుసుకునేందుకు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పోచంపల్లిలో నాయకులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్ పోచంపల్లి పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకోగా.. జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి పెద్దగూడెంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వలిగొండలో..
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం వలిగొండ మండల వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. వృద్ధులకు, వికలాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు సహాయపడ్డారు. మండలంలో మొగిలిపాక, వెల్వర్తి, వలిగొండ, నాగారం, గోకారం, గొల్నెపల్లి, సంగెం, వర్కట్‌పల్లి గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ వివరాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి.. నాయకులను అడిగి తెలుసుకున్నారు.

వర్కట్‌పల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో మొత్తం 6,432 ఓట్లగాను 5,015 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వలిగొండ మండల వ్యాప్తంగా పోలింగ్ 81.2 శాతంగా నమోదయినట్టు తహసీల్దార్ అంజిరెడ్డి తెలిపారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...