సర్వం సిద్ధం


Wed,April 10, 2019 11:46 PM

- భువనగిరి లోక్‌సభ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
- ఎంపీ నియోజకవర్గ పరిధిలో 2073 పోలింగ్ కేంద్రాలు.. 16, 27, 527 మంది ఓటర్లు
- పోలింగ్ నిర్వహణ కోసం 9,220 మంది సిబ్బంది
- పర్యవేక్షించిన కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రమేశ్, డీసీపీ నారాయణరెడ్డి


-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ లోక్‌సభ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం నిర్వహించనున్న పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో 2073 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించను న్నారు. ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది. మొత్తం16,27,527 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధ వారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రి ఆయా పోలిం గ్ కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేడు జరిగే లోక్‌సభ ఎన్నికల పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలవ్యాప్తంగా 68 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 55,398 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు 28,284, స్త్రీలు 27,653, ఒకరు థర్డ్‌జెండర్ ఉన్నారు. ఇప్పటికి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద పీవో, ఏపీవో, మరో ఇద్దరు వోపీవోలు విధులు నిర్వర్తించనున్నారు. వెయ్యి ఓట్లు పైగా ఉన్న కేంద్రంలో మరో వోపీవోను ఆదనంగా నియమించారు. తంగడపల్లి, పంతంగి, డి.నాగారం, దండు మల్కాపురం తదితర గ్రామాలను సమస్యాత్మాక గ్రామాలకు పోలీసులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో నిరంతరం చిత్రీకరణ చేయనున్నారు. సమస్యాత్మాక గ్రామాల్లోఅదనంగా కేంద్ర బలగాలను కేటాయించారు. మండలవ్యాప్తంగా ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలతోపాటు 158 మంది పోలీసులను కేటాయించారు.
అడ్డగూడూరు : నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను సర్వం సిద్దం చేశామని తహసీల్థర్ సలీమొద్దీన్ అన్నారు.బుధవారం సాయంత్రం ఎన్నికల సిబ్బంది కూడ పోలింగ బూత్‌లకు చేరుకున్నారు.మండలంలోని మొత్తం 3 రూట్లలో 30 పోలింగ్ బూత్‌లు ఉన్నట్లు తెలిపారు. ధర్మారం గ్రామంలో 38 వ పోలింగ్ కేంద్రాన్ని తహసీల్థర్ సలీమొద్దీన్ తనిఖీ చేశారు.అన్ని సదుపాయాలు ఉన్నాయా అని బిఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఒక్కరు తమ యొక్క విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది
సంస్థాన్‌నారాయణపురం : పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని మండల ఎన్నికల అధికారి, తహసీల్దార్ దయాకర్‌రెడ్డి అన్నారు. మండలంలో మొత్తం 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో మొత్తం 34317 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 17407, మహిళలు 16910 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మంచినీరు, దివ్యంగులకు వీల్‌చైర్లు వంటి మౌలిక సదుపాయాలను ఓటర్లకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచారాలు చేయకూడదని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలన్నారు.

రామన్నపేట : భువనగిరి పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయినట్లు తహసీల్దార్ బ్రహ్మయ్య సెక్టార్ ఆఫీసర్ టి. మల్లేశం అన్నారు. గురువారం మండలంలోని 12 బూతుల గాను 48 మంది సిబ్బంది హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల వ్యాప్తంగా అధికారులు సమయపాలన పాటించాలని ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమస్యను పరిష్కారానికి సెక్టార్ అధికారులను సంప్రదించాలని అధికారులకు సూచించారు. అనంతరం మండలంలోని 24 గ్రామాల్లో పోలింగ్ బూత్‌లను పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పోలీసు బందోబస్తును సీఐ శ్రీనివాస్, ఎస్సై సాయిలు పర్యవేక్షణ చేశారు.

నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మోత్కూరు : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరుగనున్న ఎన్నికలకు తుంగతుర్తి నియోజక వర్గం వ్యాప్తంగా జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసందర్బంగా నియోజకవర్గంలోని 9 మండలాల పరిధిలోని 316 పోలింగ్ బూత్‌ల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కాగా మోత్కూరు మండలంలో 31 పోలీంగ్ బూత్‌లో, తిరుమలగిరి మండంలో 37 పోలింగ్ కేంద్రాలు, నాగారం 27,తుంగతుర్తి 44, మద్దిరాల 30, నూతనకల్ 35, జాజిరెడ్డిగూడం 31 శాలీగౌరారం 51, అడ్డగూడూరు 30 ఎన్నికలు జరుగనున్నాయి. నియోజక వర్గం వ్యాప్తంగా 2,39,553 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో స్త్రీలు 1,19,282 ఉండగా 1,20,268 మంది పురుషులు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. ఈ క్రమంలో నియోజక వర్గం వ్యాప్తంగా 33 రూట్లు ఏర్పాటు చేసారు. ప్రతి రూట్‌కు ఒక సెక్టారు అధికారిని నియమించారు. 370 కంట్రోల్ యూనిట్లు, 486 ఈవీఎంలు, 412 వీవీప్యాడ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 83 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా 2,650 మంది సిబ్బందిని నియమించారు. పోలీంగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పక్కడ్భందిగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...