పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి


Wed,April 10, 2019 11:44 PM

భూదాన్‌పోచంపల్లి : పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ్ల భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీతో పాటు మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గుగులోతు దశరథ నాయక్ తెలిపారు. ఈ కేంద్రాల్లో మొత్తం 39435 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కాగా సమస్యాత్మక ప్రాంతాలైన పోచంపల్లి, పిలాయిపల్లి, కప్రాయిపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి సమ్యలు తలెత్తకుండా ఇన్‌చార్జి ఎస్సై రాజు నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 400 మంది వివిధ విభాగాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంబందిత పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తమ సామగ్రితో చేరుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులను వృద్ధులను కేంద్రాలకు చేర్చడానికి వలంటీర్లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు జోనల్ ఆపీసర్స్, మైక్రో అబ్జర్వర్స్, బీఎల్‌వోలు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది సేవలు అందించనున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు సహకరించాలని అధికారులు కోరారు.

46 పోలింగ్ కేంద్రాలు..
బీబీనగర్: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు గానూ 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో మొత్తం 146 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొననున్నట్లు బుధవారం ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని ఇందు కోసం మండల వ్యాప్తంగా 120 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు ఎస్సై సుధాకర్ గౌడ్ తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...