అభివృద్ధి నిరోధకులకు బుద్ధ్ధి చెప్పాలి


Mon,March 25, 2019 12:19 AM

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
రాజగోపాల్‌రెడ్డి రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లో ఈప్రాంతాభివృద్ధికి అడుగడుగున అడ్డుతగులుతున్న అభివృద్ధి నిరోధకుడు కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తగిన బుద్ధ్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ను జెట్ స్పీడ్‌తో అభివృద్ధి చేసిన డా. బూర నర్సయ్యగౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలని తెలిపారు. అబద్దాలు, దివాలకోరు రాజకీయాలు చేయడంలో కొమటిరెడ్డి బ్రదర్స్ దిట్టలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ గాలిలో కొట్టుకుపోయిందని తెలిపారు.


గతంలో ఎంపీగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఈప్రాంతాభివృద్ధిని పూర్తిగా విస్మరించాడని, అందుకే ఆయన ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చేతిలో చిత్తుగా ఓడిపోయారని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గంలో కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిత్తుగా ఓడిపోయారన్నారు. అక్కడ ప్రజలు చీత్కరించడంతో భువనగిరి పార్లమెంట్ స్థానానికి ఎంపీగా పోటిచేసేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలను అయోమయానికి గురిచేసి ఓట్లు కొల్లగొట్టేందుకు కొమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఈప్రాంత ప్రజలు చింతిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు రాజకీయ సన్యాసం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కాంట్రాక్టుల కోసం కక్కుర్తిపడి రాజకీయాల్లో కొనసాగుతున్న కొమటిరెడ్డి బ్రదర్స్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధ్ధి చెప్పాలని తెలిపారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చొరవతో భువనగిరిలో రూ. వెయ్యికోట్లతో ఎయిమ్స్, రూ.18కోట్లతో కేంద్రీయ విశ్వవిద్యాలయం, రూ. 400 కోట్లతో ఎంఎంటీఎస్, రూ.2.5 కోట్లతో బీమా పథకం, జాతీయ రహదారుల ఏర్పాటుకు రూ.3400 కోట్లు నిధులు, భువనగిరి పట్టణంలో పాసుపోర్టు కేంద్రం, రూ.1000 కోట్లతో చిట్యాలలో డ్రైపోర్ట్ , రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.10 కోట్లతో తాటి పరిశోధన కేంద్రం, బీసీకి రాజ్యంగ హోదా కల్పించేలా కృషి చేశారని తెలిపారు. ఈప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఎంపీగా మారోమారు బూర నర్సయ్యగౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ 16 స్థానాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని, కేంద్రంలోని ఏర్పాటు కాబోయే సంకీర్ణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారన్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానానికి సోమవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా భువనగిరిలో నిర్వహించే ర్యాలీలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు అధికం సఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రాజకీయ సన్యాసానికి రాజగోపాల్‌రెడ్డి
సిద్ధంగా ఉండాలి..
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బూర నర్సయ్యగౌడ్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాటలకు రాజగోపాల్‌రెడ్డి కట్టుబడి ఉండి రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చెల్లని చెక్కులు ఇచ్చి మాయ మాటాలు చెప్పి మరోమారు ఈప్రాంత ప్రజలను మోసం చేసేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆయన కుట్రల వలలో చిక్కుకొని ప్రజలు మోసపోవద్దని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిపారు. 60ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కాకుంటే బీజేపీ , బీజేపీ కాకుంటే కాంగ్రెస్ అధికారంలో వస్తున్నాయని, ఈ మూస దోరనికి స్వస్తి చెప్పేందుకు దేశం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటునన్నారని తెలిపారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ ముఖచిత్రం పూర్తిగా మారుతుందని తెలిపారు. ఈప్రాంతాభివృద్ధికి ఎంపీగా బూర నర్సయ్యగౌడ్ ఎంతో కృషి చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల పెన్నిదిగా పేరుగాంచిన బూర నర్సయ్యగౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీరి వెంట జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బొడ్డు రేవతీశ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీఏ జిల్లా మెంబర్ తడక చంద్రకిరణ్, సంస్థాన్‌నారాయణపురం టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, ఎల్లగిరి సర్పంచ్ రిక్కల ఇందిర సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ముటుకుల్లోజు దయాకరాచారి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొత్త పర్వతాలు యాదవ్, జిల్లా మెంబర్లు చింతల దామోదర్‌రెడ్డి , ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, ఈద్గా చైర్మన్ ఎండీ బాబాషరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ రహీం, నాయకులు బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, బొడిగె బాలకృష్ణగౌడ్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...