దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నది


Mon,March 25, 2019 12:17 AM

రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్
కంచర్ల రామకృష్ణారెడ్డి

అడ్డగూడూరు: భారతదేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నదని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెల్లని రూపాయి అని, ఎంపీ ఎన్నికల్లో భువనగిరిలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. గతంలో ఎంపీగా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఎందుకు గెలువలేదో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించడంలో నాయకులు, కార్యకర్తలు పోటీపడాలన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. మరోసారి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే దేశంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని తెలిపారు.

నామినేషన్‌కు భారీగా తరలి రావాలి
సోమవారం ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నిర్వహించే నామినేషన్ ర్యాలీకి మండలంలోని 17 గ్రామాల టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ నెల 28న మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారానికి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ రానున్నారని 1000 బైక్‌లతో 2000 మందితో భారీ ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 2న భువనగిరిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలిపారు.

టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్‌నాథ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ పూలపల్లి జనార్దన్‌రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు ఆంథోని, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు జక్కుల యాదగిరి, టీఆర్‌ఎస్ మండల ప్రధానకార్యదర్శి కంచర్ల చలపతిరెడ్డి పాల్గ్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...