పస్నూర్‌లో చలివేంద్రం ప్రారంభం


Mon,March 25, 2019 12:09 AM

నాంపల్లి: మండలపరిధిలోని పస్నూర్ గ్రామంలో యువకులు స్వచ్ఛందంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం కావడంతో ప్రయాణికుల దా హార్తిని తీర్చాలనే ఉద్దేశంతో గ్రామ యువకులందరూ కలిసి ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడేకాకుండా పక్క గ్రామమైన మేళ్ళావాయిలో కూడా ఆ గ్రామ యువకుల సహాయంతో చలివేంద్రన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ప్రయాణికులు, బాటసారుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని పలువులు యువకులను అభినందించారు. చలివేంద్రం ఏర్పాటు చేసిన వారిలో ఎస్‌కె. అబ్బస్, గిరి, మల్లేష్, శంకర్, సైదులు, గిరి, యాదగిరి, ప్రశాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...