కాంగ్రెస్, సీపీఎం ఖాళీ!


Mon,March 25, 2019 12:08 AM

- టీఆర్‌ఎస్‌కు జైకోడుతున్న మాదారం
- జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పనిచేసిన వారంతా గులాబీ గూటికి
- సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరిక
- ఉన్న ఒకరిద్దరు నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం!

శాలిగౌరారం: కమ్యూనిస్టులకు కంచుకోట, కాంగ్రెస్‌కు పుట్టినిల్లుగా ఉన్న మాదారం గ్రామంలో నేడు ఆ రెం డు పార్టీలు కనుమరుగయ్యాయి. ఆ పార్టీలను ఏలిన ఉద్దండులు ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో, తుం గతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీలు ఖాళీ అయ్యాయి.

మిగిలిన కొద్దపాటి నాయకలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధ్దమవుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలతోపాటు తుంగతు ర్తి నియోజకవర్గ యువనేత, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చేపట్టే అభివృద్ధ్దికి ఆకర్శితులై త్వరలో జరుగను న్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే.

గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మామిడి సర్వయ్య 2014లో జరిగిన అసెంబ్ల్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా మాదారం గ్రామ మాజీసర్పంచ్ నోముల వెంకన్న రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా, శాలిగౌరారం జడ్పీటీసీగా పనిచేయడమే కాకుండా తన భార్య నోముల సృజన ను కూడా గ్రామ సర్పంచ్‌గా గెలిపించుకున్న సీపీఎం సీనియర్ నాయకుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ టీఆర్‌ఎస్‌లో చేరారు.

గ్రామ ఎంపీటీసీగా బాధ్యతలు చేపడుతున్న నోముల విజయ్‌కుమార్ రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్న తాళ్ళూరి మురళి, సీపీఎం నుంచి శాలిగౌరారం పీఏసీఎస్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్న మామిడి రమేష్ వీరం తా టీఆర్‌ఎస్‌లో చేరడంతో గ్రామంలో సీపీఎం, కాం గ్రెస్ ఖాళీ అయ్యాయని చెప్పవచ్చు.

గ్రామంలో మొత్తం 2400ఓట్లు, 4800 జనాభా ఉన్నారు. వీరు పార్టీలో చేరడంతో టీఆర్‌ఎస్‌కు మంచి బలం చేకూరనుందని పలువురు పేర్కొంటున్నారు.
-మామిడి సర్వయ్య, మాదారం

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆకర్షితులై..
ప్రభుత్వం చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులమై నేడు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రధానంగా ఎ మ్మెల్యే కిశోర్‌కుమార్‌తో కలిసి పని చేయాలనే ఆలోచనతో పార్టీలో చేరడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బందు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర పథకాలు బాగున్నాయి. అభివృద్ధ్దిలో భాగస్వాములు కావాలనే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నాం.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...