రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


Mon,March 25, 2019 12:02 AM

అడ్డగూడూరు : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని చిర్రగూడూరు స్టేజి వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మేడిపల్లికి చెందిన జానకీరామ్ అతని 11 మంది స్నేహితులతో కలిసి మహబూబ్‌బాద్ జిల్లా కేసముద్రం మండలకేంద్రంలోని అతని స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్తున్నారు.

వీళ్లంతా ఘట్కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నారు. అయితే వీళ్లు ఆదివారం మేడిపల్లి నుంచి 11 మంది వేర్వేరు బైక్‌లపైన వివాహానికి వెళ్తున్నారు. రాగిరి జానకీరామ్ (23) అతని స్నేహితుడు మణుకొండ మురళి (22) టీఎస్ 07 సీడీ 6663 నెంబర్‌గల బుల్లేట్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని చిర్రగూడూరు స్టేజి వద్ద ముందు వెళ్తున్న తోర్రూరు డిపోకు చెందిన టీఎస్ 26 జెడ్ 0010 నెంబర్‌గల ఎక్స్‌ప్రెస్ బస్సు ఓవర్‌టెక్ చేయబోయి బైక్‌టైర్ స్లిపై కిందపడిపోయారు. దీంతో వెనుక నుంచి వస్తున్న బస్సు వారిపైకి దూసుకెళ్లింది.

దీంతో బైక్ నడుపుతున్న జానకీరామ్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుకల కూర్చున్న మురళికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం బస్సు డ్రైవర్ చందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇద్రీస్‌అలీ తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...