శిల్పకళా సౌరభం


Sun,March 24, 2019 12:48 AM

- యాదాద్రిలో తుది దశకు చేరుకున్న నిర్మాణాలు
- నగిషీ పనులను మరింత నాణ్యతగా చేపట్టాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి సూచన
- అహోరాత్రులు శ్రమిస్తున్న 2000 మంది శిల్పులు
- అద్భుతంగా యాదాద్రి దివ్య క్షేత్రం : కిషన్‌రావు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం అద్భుత శిల్పకళా సౌరభాలతో సరికొత్త రూపు సంతరించుకుంటున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పనులపై దిశానిర్దేశం చేసేందుకు శనివారం హైదరాబాద్‌లోని సీఎంవో కార్యాలయంలో సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి వైటీడీఏ సమావేశం నిర్వహించారు. వైటీడీఏ వైస్ చైర్మన్ జి. కిషన్‌రావు, స్థపతులు సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారివేలు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్కిటెక్టు ఆనం దసాయి, ఈఈ వసంతనాయక్, ఉప స్థపతులు, ఇంజినీర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయని, నగిషీ పనులు మరింత జాగ్రత్తగా చేయించాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. జరుగాల్సిన పనులు, జరిగిన పనులపై సమీక్షించారు. పశ్చిమ గోపురం వద్ద పోర్టికోను అందంగా తీర్చిదిద్దడంతో ఈ ప్రాంతం ఎంతో శోభాయమానంగా ఉందన్నారు. శివాలయం ప్రాకారం చుట్టూ నందులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే శివాలయం చూడ ముచ్చటగా ఉన్నదని, మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు.

అంతర్జాతీయ స్థాయిలో పునర్నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం అద్భుత శిల్పకళాసౌరభాలతో సరికొత్త రూపు సంతరించుకుంటున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పనులపై సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి దిశానిర్దేశం చేసేందుకు శనివారం హైదరాబాద్‌లోని సీఎంవో కార్యాలయంలో వైటీడీఏ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, స్థపతులు సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారివేలు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్కిటెక్టు ఆనందసాయి, ఈఈ వసంతనాయక్‌లు, ఉప స్థపతులు, ఇంజినీర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శిల్పినిర్మాణం పనులు అద్భుతంగాఉన్నాయని నగిషీ పనులు మరింత జాగ్రత్తగా నిర్వహించాలని సీఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. జరుగాల్సిన పనులను, జరిగిన పనులను సమీక్షించారు. పచ్చిమ గోపురం వద్ద పోర్టికోను అందంగా తీర్చిదిద్దడంతో పచ్చిమగోపురం ప్రాంతం ఎంతో శోభాయమానంగా మారిందన్నారు. అదేవిధంగా తూర్పుగోపురం వద్ద కూడా చేపట్టాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించారు. శివాలయం ప్రాకారం చుట్టూ నందులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే శివాలయం చూడముచ్చటగా ఉన్నదని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని భూపాల్‌రెడ్డి ఆదేశించారు.

తిరుమల స్థాయిలో..
తిరుమల స్థాయిలో అభివృద్ధికి యాదాద్రీశుడి ఆలయాన్ని ఆధార శిల నుంచి శిఖరం వరకు ఒకే జాతికి చెందిన పటిష్టమైన కృష్ణశిలతో నిర్మిస్తున్న పనులు తుది దశకు చేరాయి. శిలలపై భాగవత, పురాణ ఇతిహాసాల దేవతామూర్తుల శిల్పాలు, సుందరమైన కట్టడాలతో యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మికనగరిగా రూపుదిద్దుకున్నది. అంతర్, బాహ్య ప్రాకారాలు, సప్తగోపురాలు, బంగారు శోభతో విమానగోపురాల సముదాయంతో మహిమాన్వితమైన యాదాద్రి క్షేత్రం అటు ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ప్రాచీన శిల్ప కళా వైభవాన్ని చాటిచెప్పే రీతిలో ఉన్నాయి. చరిత్రలో ఓ కలికితురాయిగా నిలిచిపోయేస్థాయిలోనిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. విశ్వనగరం హైదరాబాద్‌కు చేరువలోని రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి అద్భుత శిల్ప కళాసౌరభాలతో సరికొత్త రూపు సంతరించుకున్నది. శిల్పి పనులు దాదాపుగా ముగిసే స్థాయికి చేరుకున్నాయి. సీఎం సూచించిన పనులు నగిషీ పనులు జరుగుతున్నాయి. నగిషీ పనులను మరింత మేలు కలిగించేవిగా ఉండేలా చూసుకోవాలని సీఎంవో కార్యదర్శి పేర్కొనడం విశేషం.

్మణం చేస్తున్నట్లు స్థపతులు పేర్కొంటున్నారు.2000 మంది శిల్పులు..
ఏనిమిది దశాబ్దాల క్రితపు కాకతీయ రాజుల కాలం తర్వాత అంతటి భారీ ఎత్తున రాతిశిలలు, అద్భుత శిల్పాలతో కట్టడంగా ఆధునిక చరిత్రలో సుస్థిర స్థానం పొందేవిధంగా యాదాద్రి పుణ్యక్షేత్రం పునిర్నిర్మిస్తున్నారు. అందుకోసం 2000 మంది శిల్పులు ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. వీరిలో ఆలయ నిర్మాణశాస్త్రంతో పాటు శిల్పకళాశాస్త్రంలో ప్రావీణ్యులైన స్థపతుల పర్యవేక్షణలో తమిళనాడుకు చెందిన శిల్పులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. ప్రకాశం జిల్లా ఆళ్లగడ్డతో పాటు యాదగిరిగుట్ట పరిసరాల్లో గుండ్లపల్లి, పాతగుట్ట ప్రాంతాల్లో ప్రత్యేకంగా శిల్పాలను తయారు చేసి ఆలయ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి తమ ఉలులతో శిలలకు ప్రాణం పోయగా వాటిని కొండపైన వివిధ నిర్మాణాలకు ఉపయోగించే పనులు తుదిదశకు చేరాయి.

పనుల్లో ముస్లిం శిల్పకళాకారులు..
కళకు కులం, మతం, ప్రాంతం అడ్డు కాదని చాటుతున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ముస్లిం శిల్ప కళాకారులు. యాదాద్రి పునర్నిర్మాణంలో తమిళనాడుకు చెందిన శిల్పులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లిం శిల్పులు కూడా తమ శిల్పకళా నైపుణ్యంతో కీలక భూమిక పోషిస్తున్నారు. గుంటూరు జిల్లా తుర్కపాలెం గ్రామానికి చెందిన దాదాపు 40 మంది శిల్పులు పనిచేస్తున్నారు. హిందూధర్మ ప్రకారం స్థపతులు సూచించిన మూర్తులకు తమ ఉలితో శిలలకు జీవం పోస్తున్నారు. ముస్లిం మత సంప్రదాలయాలను పాటించే కళాకారులు ముత్తాతల కాలం నుంచే ఆలయ నిర్మాణాలకు శిల్పాలు చెక్కడం చేస్తున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో చోళులు, పల్లవుల, కాకతీయ కాలం నాటి శిల్పకళా రీతుల్లో శిల్పాలు చెక్కడంతో తర్పీదు పొందారు. అప్పటి నుంచి వారసత్వంగా తమ కుటుంబాలు శిల్పాల తయారీ పనులు కొనసాగిస్తూ ఆలయ నిర్మాణాల్లో భాగస్వాములవుతున్నట్లు యాదాద్రి నిర్మాణానికి శిల్పి పనులు చేస్తున్న యూనీస్ అనే ముస్లిం శిల్పకళాకారుడు తెలిపారు.

అద్భుతంగా నిర్మాణం..
యాదాద్రిని అద్భుతంగా నిర్మాణం చేసే పనులు తుది దశకు చేరాయి. ప్రతి పనిపై కూలంకశంగా చర్చించి ముందుకు సాగుతున్నాం. ఎక్కడా జాప్యం లేకుండా పనులు చేపడుతున్నాం. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 3న ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని పనులు నిర్వహిస్తున్నాం. 2.3 ఎకరాల విస్తీర్ణం నుంచి 4.5 ఎకరాల విస్తీర్ణానికి సివిల్ పనులు పెంచినందున దీనికి సంబంధించిన నివేదికలను తయారు చేసి రెడీగా ఉంచాం. సీఎం ఆమోదముద్రతో పనులు ప్రారంభమవుతాయి.
-జి.కిషన్‌రావు, వైటీడీఎ వైస్ చైర్మన్

కృష్ణశిలతో నిర్మాణం..
దక్షిణ భారతదేశంలోనే అత్యద్భుత శిల్పకళా సంపదలతో తిరుమల స్థాయిలో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారు. ఆధార శిల నుంచి శిఖరం వరకు ఒకే జాతికి చెందిన పటిష్టమైన నల్లరాతి కృష్ణశిలతో సాగుతున్న ఆలయ నిర్మాణం పనులు ముగింపు దశకు చేరాయి. ఈ నిర్మాణానికి ఆధునిక నిర్మాణ రీతుల్లో సిమెంట్ వంటి సామగ్రిని వినియోగించుకుండా జనుము, కానుగ గింజలు, సున్నపురాయి, బెల్లం, పటిక వంటి సంప్రదాయ పదార్థాలతో డంగుసున్నం వినియోగిస్తున్నారు. పటిష్టంగా ఉండేవిధంగా ఆలయ నిరా

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...