యాదాద్రిలో నిత్య పూజల కోలాహలం


Sun,March 24, 2019 12:46 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. యాదాద్రిలో నిత్య పూజల సందడి కొనసాగుతున్నది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి ధర్మదర్శనాలకు 2 గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీవారి ముఖ మండపంలో స్వామివారిని దర్శించుకున్నామన్న ఆనందం ఈ పూజలతో భక్తులకు కలుగుతుంది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

రూ.11,78,408 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.11,78,408 ఆదాయం సమకూరినట్లు ఆదాయ శాఖాధికారులు తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.4,10,240 ప్రధాన బుకింగ్‌తో 1, 24,992 వ్రత పూజలతో శ్రీవారి ఖజానాకు రూ.99,000 గదులు విచారణ శాఖతో రూ.64,180 ఆదాయం సమకూరిందని ఆదాయ శాఖాధికారులు తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...