గులాబీ జెండా ఎగురడం ఖాయం


Sun,March 24, 2019 12:46 AM

రాజాపేట : భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపీగా బూర నర్సయ్యగౌడ్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందజేద్దామని ఆయన అన్నారు. శనివారం చెల్మిడి ఫంక్షన్‌హాల్లో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజక వర్గంలో కారుదే జోరు కొనసాగుతుందన్నారు. బూర నర్సయ్యగౌడ్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. బీబీనగర్‌లో రూ. 1000 కోట్లలతో ఎయిమ్స్ , భువనగిరిలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, పాస్‌పోర్ట్ కార్యాలయంతో పాటు 524 కిలోమీటర్ల నాలుగు లేన్ల జాతీయ రహదారుల ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారన్నారు. అపర భగీరథుడైన సీఎం కేసీఆర్ ఆలేరు, భువనగిరి ప్రాంతంలోని 60 ఏండ్ల కరువు నేలను తడుపాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. బస్వాపుర్, గంధమల్ల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కానుందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను యావత్తు దేశం ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. రైతుబంధు పథకాన్ని కేంద్రమే ఏకంగా కాపీ కొట్టిందని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్, బీజేపీల 70 ఏండ్ల పాలనలో దేశాన్ని సర్వనాశనం చేశారని, వారి పాలనుకు చమరగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బూర నర్సయ్యగౌడ్ భారీ మెజార్టీతో గెలిచే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ స్వప్నమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా, రాష్ట్ర అభివృద్ధితో పాటు ఢిల్లీ గద్దెలను శాసించేలంటే 16కు 16 ఎంపీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. పార్టీకి కార్యకర్తలే వీర సైనికులని ప్రభుత్వ పథకాలను గడప గడపకూ తీసుకపోవాలన్నారు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ నాగిర్తి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్, సందిల భాస్కర్‌గౌడ్, రేగు సిద్ధులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాపోలు లకా్ష్మరెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్లు చింతలపూరి వెంకట్‌రాంరెడ్డి, అర్కాల గాల్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ గుర్రం నర్సింహులు, సీసీ బ్యాంక్ చైర్మన్ బోళ్ల రాఘవరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు గౌటే లక్ష్మణ్, నాయకులు రెడ్డబోయిన రాజు, దాచపల్లి శ్రీనువాస్, బిల్ల శ్రీనివాస్, పాండవుల భానుప్రకాశ్‌గౌడ్, జెల్ల భిక్షపతిగౌడ్, సందిల ఉదయ్‌భాస్కర్‌గౌడ్, రావుల హరిబాబు, ఆడేపు శ్రీశైలం, చామకూర గోపాల్‌గౌడ్, నరేందర్, టాకూర్ ప్రమోద్‌సింగ్, గుంటి కృష్ణ, మేక సోమిరెడ్డి, ఎర్రగోకుల జశ్వంత్, కాలే సుమలత, ఆడెపు రమాదేవి, ఆడెపు విజయ, ఎర్రగోకుల జశ్వంత్, కరీం, సర్పంచ్‌లు గుంటి మధుసూదన్‌రెడ్డి, గాడిపల్లి శ్రవణ్‌కుమార్, పంబ కరుణాకర్, నాగిర్తి గోపిరెడ్డి, కిషన్,

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...