బడులే విద్యార్థులకు దేవాలయాలు


Sun,March 24, 2019 12:46 AM

మోటకొండూర్ : విద్యనభ్యసించేందుకు నెలకొల్పబడిన బడులే విద్యార్థులకు దేవాలయాలని, అక్షరాలను ఆయుధంగా మలుచుకుని దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేలా విద్యార్థులు తయారు కావాలని మోటకొండూర్ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత అన్నారు. శనివారం మోటకొండూర్‌లోని మ హాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల రెండో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పా ల్గొన్నారు. అక్షరమా.. అక్షరమా.. నిన్ను గన్న మనిషికి నీవు రక్షణేసుమా.. అని ఈ సమాజంలో మనుషుల కన్న అక్షరాలకు ఎంత విలువుందో ఈ సామెతను బట్టి అర్థం చేసుకోవాలని తెలిపారు. సమాజం మార్పు చెందిదంటే అది అక్షరజ్ఞానం గొప్పతనమేనని అన్నారు. అలాంటి అక్షరాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థినులు ప్రయత్నించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను నిరుపేదలకు చేరువ చేశారని వివరించారు. ఈ గొప్ప అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు ఆకలేస్తే అన్నం తినడంకాదు, ఆకలైనప్పుడు అక్షరాలు తినే విధంగా విద్యార్థులు ఎదుగాలని తెలిపారు. ఒక డాక్టర్ తప్పు చేస్తే మనిషి మాత్రమే చనిపోతాడు.. ఒక ఇంజినీరు తప్పు చేస్తే ఒక భవనం మాత్రమే కూలిపోతుందన్నారు.. కానీ ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ఈ సమాజం, వ్యవస్థ నష్టపోతుందని తెలిపారు. కాబట్టి ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో మనం అర్థం చేసుకోవాలని గుర్తు చేశారు. వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థినులు డ్యాన్‌లతో అలరించారు. వివిధ వేషధారణలతో విద్యార్థినులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ దయాకర్‌రెడ్డి, ఏటీపీ భాగ్యలక్ష్మి, రజిని, పీఈటీ నవనీత, పూర్ణిమ, ఆర్.కవిత, ఎం.కవిత, సోహిని, నిరోషా, సృజన, వెంకటలక్ష్మి, మాధవి, నర్మద, వీణ, ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...