కేంద్రంలో చక్రం తిప్పేది కేసీఆరే


Sun,March 24, 2019 12:46 AM

బచ్చన్నపేట : రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ గెలువడంతోపాటు కేంద్రంలో చక్రం తిప్పేది సీఎం కేసీఆరే అని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీనిధి ఫంక్షన్‌హాల్‌లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జనగామ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బచ్చన్నపేట, చేర్యాల, కొమురవెళ్లి, జనగామ, నర్మెట, తరిగొప్పుల, మద్దూరు మండలాల సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, రైతుసమన్వయ సమితి సభ్యులు, గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు నాలుగు వేల మంది హాజరయ్యారు. ఈ సందర్బంగా బూర మాట్లాడుతూ భువనగిరి ఖిల్లాపై గులాబీజెండా , డిల్లీ ఎర్రకోటపై కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయాలంటే ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించారన్నారు. నేడు లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు ఆయన వెంట ఉన్నారని అన్నారు. అందుకే రెండో సారి రాష్ట్రంలో గులాబీ దళపతికి పట్టం కట్టారని అన్నారు. ఒకనాడు ఆదర్శంగా ఉన్న గుజరాత్ కనుమరుగై నేడు తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి బీబీనగర్‌కు ఎయిమ్స్ మంజూరు చేయించామన్నారు.

జనగామలో శాతవాహాన రైలు హల్టింగ్, కోట్లు వెచ్చించి 524 కిలోమీటర్ల రహదారులను మెరుగుపర్చామన్నారు.సమావేశంలో పాల్గొన్న శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే ఒక బలమైన శక్తులని అన్నారు. రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్ పార్టీ నేడు జోష్‌మీద ఉందన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు కేసీఆర్‌ను ప్రధానిగా, రాష్ట్ర ప్రజలు సీఎంగా కేటీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. ఎంపీగా బూర నర్సయ్యగౌడ్‌ను మరోసారి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చెంద్రారెడ్డి, కొమురవెళ్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, పార్టీ రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మాయాదగిరిరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఆయా మండలాల అధ్యక్షులు స్వప్న, విజయసిద్ధ్దులు, యాదగిరిగౌడ్, శ్రీధర్, శ్రీధర్‌రెడ్డి, కళింగరాజు, గౌస్, సంజీవరెడ్డి, నరేందర్, ఉపేందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఆంజనేయులు, షభ్బీర్, జావీద్, కిష్టయ్య, లెనిన్, యాదగిరిరెడ్డి, రమేశ్, సిద్దులు, మహేందర్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...