ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు


Sat,March 23, 2019 12:46 AM

భువనగిరి అర్బన్, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్ : భువనగిరి డివిజన్ పరిధిలో 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 854 ఉపాధ్యా ఓటర్లుండగా 795 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డివిజన్‌లో 93.09 పోలింగ్ శాతం నమోదైంది. వలిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం పరిధిలో 84 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా.. 79 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల పోలింగ్ అధికారి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎన్.అంజిరెడ్డి, వీఆర్వో నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి మండల వ్యాప్తంగా 95 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా.. 89 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రం పరిశీలన..
బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షణ అధికారి, ఎంపీడీవో శ్రీవాణిని అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా 68 ఉపాధ్యాయ ఓటర్లుండగా.. 65 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణరెడ్డి, వీఆర్‌వో వెంకటేశ్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...