పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం


Sat,March 23, 2019 12:46 AM

వలిగొండ : పరిశుభ్రత, పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని డాక్టర్ జ్యోతి అన్నారు. వలిగొండ మండలం పరిధి లోతుకుంటలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, తెలంగాణ పీడియాట్రిక్ అకాడమీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదసుసకు ఆమె హాజరై మాట్లాడారు. కౌమార దశలో వచ్చే మార్పులకు అనుగుణంగా జాగ్రతలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు, మత్స్యగిరి, ఏఎన్‌ఎం శోభ, పాఠశాల ఇన్‌చార్జి దుర్గ, పీఈటీ మమత పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...