నేడే ఎమ్మెల్సీ పోలింగ్


Fri,March 22, 2019 12:49 AM

-ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్
-ఓటు హక్కు వినియోగించుకోనున్న 1, 319 మంది ఉపాధ్యాయులు
-ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ అనితారామచంద్రన్
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమయ్యింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాగే పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 1319 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు భువనగిరి, చౌటుప్పల్ డివిజన్ పరిధిలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంతో పాటు చౌటుప్పల్‌లోని ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ అనితారామచంద్రన్ గురువారం సందర్శించారు. ఎన్నిక కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్ధం చేశారు. భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రలోని ఏర్పాట్ల్లను కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులను పోలింగు కేంద్రాలకు పంపిణీ చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. మైబైల్ పెట్రోలింగ్ అదనంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 1319 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. భువనగిరి డివిజన్‌లో 854 మంది ఓటర్లు, చౌటుప్పల్ డివిజన్‌లో 465 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రచారం చేస్తూ తమ అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషి చేశారు. టీఆర్‌ఎస్ మద్దతిస్తున్న పూల రవీందర్ వైపు జిల్లాలోని అధిక టీచర్లు మొగ్గుచూపుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నందున ఏ రాజకీయ పార్టీకాని సంస్థ తరపున గానీ, వ్యక్తులుగానీ అనుమతి లేకుండా ఏలాంటి సభలు, సమావేశాలు ర్యాలీలు, ధర్నాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించరాదని కలెక్టర్ అనితారమాచంద్రన్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంపీగా పోటీచేసేవారు నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూడా ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, నామినేషన్ దాఖలు చేయు వ్యక్తితో కలిపి ఐదుగురు వ్యక్తులకు మించకుండా నామినేషన్ వేయాలని తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...