ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Fri,March 22, 2019 12:46 AM

బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి : ఎమ్మెల్సీ ఎన్నికలకు మండలంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్‌రావు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలవ్యాప్తంగా 68 మంది ఉపాధ్యాయుల ఓట్లు ఉన్నట్లు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కొనసాగుతుందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఎన్నికలు జరుగనుండగా మండల వ్యాప్తంగా మొత్తం 95 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, స్థానిక తహసీల్దార్ గుగులోతు దశరథనాయక్ తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...