వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం


Fri,March 22, 2019 12:46 AM

మోత్కూరు : మండల కేంద్రలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారిని పెళ్లి కొడుకుగా.. పార్వతీదేవిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారి పరిణయ తంతు వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతియేటా పాల్గుణ చతుర్థశి కాముని పౌర్ణమి రోజున స్వామివారి కల్యాణం కమనీయంగా జరగడం విశేషం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు స్వామివారిని శావపై మోసుకుంటూ బుధవారం రాత్రి గ్రామ, పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగించారు. గ్రామంలోని గడి బజారులోని మూడు బాటల కూడళిలో కాముని దహనం(భూతం)నుంచి భక్తులు స్వామివారిని మోసుకుంటూ నడిచి వెళ్లారు. గురువారం తెల్లవారుజాము వరకు భక్తులు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

గ్రామ, పట్టణ పుర ప్రముఖులు, మహిళలు తల స్నానం చేసుకొని మంగళహారతుల పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ సన్నిధి ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో పెళ్లి కుమారుడు శ్రీవారు, పార్వతీదేవిలను తీసుకొచ్చారు. పెళ్లి పందిరిలో స్వామివారిని కూర్చోబెట్టి సంప్రదాయ విధానంగా విశ్వక్సేనపూజ, పుణ్యావచనం జరిపి అనంతరం ధన, కానుక, వజ్ర, అభరణాలు, వస్ర్తాలతో అలంకరణ చేసి ఆగమశాస్త్ర రీత్యా శాస్ర్తోక్తంగా పురోహితులు పెళ్లితంతు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని భక్తులు పల్లకిలో మోసుకొని ఆలయం చుట్టూ తిరుగుతూ ప్రదక్షణలు చేసి ఆలయ గర్భగుడి సన్నిధిలోకి వెళ్లి కొలువుదీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో సతీసమేతంగా స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖులను శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదలు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్రుగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు కల్వల ప్రకాశ్‌రాయుడు, భక్తులు గనగాని నర్సింహ, బుస్సా శ్రీనివాస్, పట్టూరి అంజయ్య, డి.అరవిందరాయుడు, సుధగాని కిష్టయ్య, కారుపోతుల వెంకన్న, లోడే యాదగిరి, మొగుళ్లపల్లి సోమయ్య, పులకరం అబ్బయ్య, బీసు యాదగిరి, మొరిగాల వెంకన్న, నల్లమాస లింగయ్య, కోల శ్రీను, బీసు మధు, జహంగీర్, రాజయ్య గొడిశాల శ్రీను, శ్రీధర్, పురోహితులు పారునంది వెంకటరమణశర్మ, ఆలయ అర్చకులు రాజలింగంశర్మ, పవన్‌కుమార్, మోత్కూరి ప్రదీప్ శర్మ, కె.శ్రీనివాసశర్మ, భక్తులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...