ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Fri,March 22, 2019 12:46 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : నేడు జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి.. చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం ఎన్నికల నిర్వహణపై రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 1320 ఓట్లు ఉన్నాయని, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్‌లో 466 ఓట్లు ఉండగా.. చౌటుప్పల్‌లో 159 ఓట్లు ఉన్నాయని వివరించారు. అన్ని మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్లు ఓటర్ స్లిప్‌తోపాటు ఏదైన ఐడెంటి కార్డు తీసుకువెళ్లాని సూచించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మోటకొండూరులో అతి తక్కువగా 11 ఓట్లు ఉన్నాయని, భువనగిరిలో 300 పైచిలుకు ఓట్లు ఉన్నాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్, వీడియోగ్రాఫి, మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆమె వెంట ఆర్డీవో ఎస్.సూరజ్‌కుమార్, తహసీల్దార్ రవీంద్రసాగర్ తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...