పోలీసులు ఫ్లాగ్ మార్చ్


Fri,March 22, 2019 12:46 AM

బీబీనగర్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం బీబీనగర్‌లో 5 కిలో మీటర్ల పాటు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలతో కార్యక్రమం సాగింది. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా భద్రతపై భరోసా కల్పించడంలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన కొండమడుగు, నెమురగొములలో కవాతును నిర్వహించి గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ భుజంగరావు, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల అపోహలు తొలగించేందుకే ఫ్లాగ్ మార్చ్ : డీసీపీ
ఓటర్లకు పూర్తి స్వేచ్ఛా వాతావరణం కల్పించడంతోపాటు ఓటర్లలో నెలకొన్న అపోహలను తొలగించేందుకే గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని డీసీపీ తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగేలా అందరూ సహకరించాలని కోరారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...