యాదాద్రిలో ప్రత్యేక పూజల కోలాహలం..!!


Fri,March 22, 2019 12:46 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. హోలీ సందర్భంగా సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. హోలీ సందర్భంగా వసంతసేవోత్సవం నిర్వహించారు. సాయంత్రం జరిగిన సేవలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగులను చల్లుకుంటూ అర్చకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన రంగులతో శ్రీవారు, అమ్మవారి, భక్తులపై చల్లుతూ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం జరిగాయి. కొండపై గల పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణి చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా వ్రత పూజలు..
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 75, 500 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ.13,59,636 ఆదాయం..
శ్రీవారి ఖజానాకు రూ.13,59,636 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.90,640; 100 రూపాయల టిక్కెట్‌తో రూ.38,400, కల్యాణకట్ట ద్వారా రూ.23,200 గదులు విచారణ శాఖతో రూ.30,800, ప్రసాద విక్రయాలతో రూ.4,10,300, శాశ్వత పూజలతో రూ.27,348 ఆదాయం సమకూరినట్టు తెలిపారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...