ప్రమాదవశాత్తు చెరువులో పడి గొర్రెల కాపరి మృతి


Fri,March 22, 2019 12:46 AM

వలిగొండ : ప్రమాదవశాత్తు చెరువులో పడి గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం వెల్వర్తి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం వీరవెళ్లి గ్రామానికి చెందిన చిన్నం రాజేశ్వర్(18)వృత్తి గొర్రెల కాపరి ఇతను గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన మోటె సత్తయ్య వద్ద గొర్రెల కాపరిగా జీతం చేస్తూ గురువారం గొర్లను కడుగడానికి యజమాని తోపాటుగా వెల్వర్తి గ్రామ పెద్దచెరువులోకి వెళ్లి గొర్రెలను కడుగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజేశ్వర్ కాలు జారీ ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెల్వర్తి గ్రామ గజ ఈతగాళ్లు నీటమునిగిన ప్రదేశంలో సుమారు మూడు గంటల పాటు వెతికి మృత దేహాన్ని బయటకు తీశారు. అనంతరం వలిగొండ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నసేట సీఐ శ్రీనివాస్, వలిగొండ ఎస్సై శివనాగప్రసాద్ తెలిపారు.
మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శ..
ప్రమాద వార్త తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం మృతుడి తల్లి లక్ష్మమ్మను ఓదార్చి దాహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దుర్ఘటన ప్రదేశంలో ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, తహసీల్దార్ ఎన్.అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండరి, గుర్రం లకా్ష్మరెడ్డి, మాద శంకర్‌గౌడ్, స్థానిక సర్పంచ్ అన్నామేరి, ఎంపీటీసీ శేఖర్ తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...