మూడో రోజు నాలుగు నామినేషన్లు


Wed,March 20, 2019 11:40 PM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బుధవారం వివిధ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు ఐదు నామినేషన్ సెట్లను దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. భువనగిరి పట్టణం బోయవాడకు చెందిన పూస శ్రీనివాస్ తెలంగాణ జనసమితి తరపున, ఆలేరు సిల్క్‌నగర్ రోడ్డుకు చెందిన కొత్త కిష్టయ్య అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ తరపున, చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన ఊదరి మల్లేశం, మోత్కూర్ మండలంల రాజన్నగూడెంకు చెందిన కొంగరి మల్లయ్యలు స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్లను దాఖలు చేశారన్నారు. అదేవిధంగా బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురు అభ్యర్థులు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వేయగా, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి కొత్త కిష్టయ్య రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...