అభ్యర్థుల ఖర్చులను నిష్పక్షపాతంగా లెక్కించాలి


Wed,March 20, 2019 11:40 PM

భువనగిరిరూరల్ : పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు చేస్తున్న ఖర్చులను నిష్పక్షపాతంగా లెక్కించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు జాకీర్‌హుస్సేన్ సూచించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకుడిగా జిల్లాకు జాకీర్‌హుస్సేన్(ఐఆర్‌ఎస్)ను నియమించింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రియాంక, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్‌రెడ్డి, ఎన్నికల విభాగాల పర్యవేక్షకులు, నోడల్ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులు ఖచ్చితంగా లెక్కించి నమోదు చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల్లో మద్యం, డబ్బు తరలించకుండా ఫ్లయింగ్‌స్కాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాల నిఘా పటిష్టంగా చేపట్టాలని కోరారు. అధికారులందరూ పారదర్శకంగా పనిచేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీని ఆయన పరిశీలించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...