పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు


Wed,March 20, 2019 12:05 AM

ఆలేరుటౌన్ : త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని భువనగిరి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి డా.బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో జాగృతి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోదాడ శ్రీను అధ్యక్షతన ఏర్పాటు ఏర్పాటు చేసిన ఆత్మీయసమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీలకు ఎంతో విలువ పెరిగిందన్నారు. భువనగిరి ఎంపీగా కేసీఆర్ నాయకత్వంలో భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. 3500 కోట్ల తో భువనగిరిలో ఎయిమ్స్ దవాఖాన, కేంద్రియ విద్యాలయం ఏర్పాటు చేశామని, పోచంపల్లిలో ఇం డస్ట్రీయల్ పార్కు, నకిరేకల్‌లో డ్రైపోర్టు నిర్మాణం, కులవృత్తులకు చేయూత కల్పించేందుకు కళాకారులకు అధునికి పద్ధతులతో హస్తాకళల శిక్షణ కేంద్రాలను పెంబర్తి గ్రామంలో ఏర్పాటుకు కృషి చేశామన్నారు. అంతేకాకుండా జాతీయ రహదారుల నిర్మా ణం, సీఎం కేసీఆర్ సహకారంతో యాదాద్రి దేవాలయాన్ని రెండో తిరుపతిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

రాష్ర్టానికి నిధులు, విధుల విషయంలో కూ డా తెలంగాణ తరుపున నా వాదనాలు వినిపించి అనేక అభివృద్ధి పనులు సాధించామన్నారు. 5 ఏండ్లల్లో భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి ఏమి అభివృద్ధి చేశాడో భువనగిరి ప్రజలకు తెలుసన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి నల్లగొండ ప్రజలకు కూడా ఏమి చేయలేదు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు తగిన విధంగా బుద్ధిచెప్పారన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయి ఏమి చేయ్యాలో తెలియక, దిక్కులేక భువనగిరి ఎంపీ ఎన్నికల్లో పోటి చేయాలని చూస్తున్న కోమటిరెడ్డికి మళ్లి ఓటమి తప్పదన్నారు. ఇద్దరు అన్నాదమ్ములు కలిసి భువనగిరి ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తే ఇక్కడి ప్రజలు ఉర్కోరన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలకు దూరమవుతామన్ని చెప్పి మాటమీద నిలబడని వాళ్లకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. ప్రజలు న్యాయనిర్ణేతలని వారికి అన్ని తెలుసన్నారు. త్వరలో జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దేశానికి కేసీఆరే దిక్కు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వమే దిక్కని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలో జరిగిన జాగృతి సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చేసిన కుట్రలతో మన కులవృత్తులు కనుమరుగయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక కవిత నాయకత్వంలో జాగృతి సాంస్కృతిక సంస్థ అనేక కార్యక్రమాలు చేసి టీఆర్‌ఎస్ విజయానికి నాంది పలికిందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలను కేటీఆర్, కవిత దశ దిశలకు వ్యాపింపచేశారన్నారు. బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో ఈనాడు సంబురంగా చేసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి అభ్యర్థులకు విజయం సాధించడంలో సంస్థ సభ్యులు చేసిన సహాయం మరిచిపోలేమన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా 16 ఎంపీ సీట్లను గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు.

సారు-కారు-పదహారు-ఢిల్లీలో సర్కారు..
కేటీఆర్ నాయకత్వంలో జరుగుతున్న ఎంపీ ఎన్నిల్లో విజయం సాధించాలని, సారు-కారు-పదహారు-ఢిల్లీలో మన సర్కారు ఏర్పాటుకు మన సహాకారం ఎంతో అవసరమని టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. అలేరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాగృతి సంస్థ ప్రజలకు జాగృతి చేస్తుందనడంతో ఎటువంటి సందేహం లేదన్నారు. తెలంగాణ భాషా, యాస, సంస్కృతిని రక్షిస్తూ మన పండుగలైన బతుకమ్మ, బోనాల పండుగకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో వేసే మన ఓటు కేసీఆర్‌కే అనే విధంగా ఇంటింటికీ ప్రచారం చేస్తూ మన ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోమటి రెడ్డి బ్రదర్స్ ఎన్ని కుట్రలు చేసిన గెలువలేరని, వారికి కూడా ఈ విషయం తెలుసన్నారు. మన ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కాళేశ్వరం ప్రాజేక్టుకు జాతీయహోదా రావాలని అప్పుడే తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు వీలవుతుందన్నారు.

అనంతరం ఎంపీ అభ్యర్థి డా. బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు జాగృతి సంస్థ సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంపీకి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోదాడ శ్రీను, రాష్ట్ర జాగృతి నాయకులు సుచిత్రారావు, యదాద్రి భువనగిరి జిల్లా జాగృతి కన్వీనర్ బాలప్రసాద్, జనగాం జిల్లా జాగృతి కన్వీనర్ మురళి, ఆలేరు విభాగం కన్వీనర్ సూదగాని ఉదయ్‌కుమార్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆకవరం మెహన్‌రావు, ఎంపీపీ క్యాసగళ్ల అనసూయ.

జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీటీసీలు బింగి రవి, చింతకింది మురళి, పిక్క శ్రీను, బాకి అనంద్, రచ్చ కావ్యశ్రీ, కొలనుపాక గ్రామశాఖ అధ్యక్షుడు గాదె సోమిరెడ్డి, సర్పంచులు బాకి రాంప్రసాద్, చెక్కిళ్ల మాధవీరవీందర్, వంగాల శ్రీశైలం, నాయకులు కోటగిరి ఆంజనేయులు, మల్లిగాని మల్లేశ్, మదాని పిలిఫ్, బెంజారపు రవి, జల్లి నర్సింహులు, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, వస్పరి శంకర్, బీజని మధు, సరాబు సంతోశ్‌కుమార్, ఇల్లెందు మల్లేశం, కందుల శంకర్, సముద్రాల కుమార్, గుత్తా శమంతకరెడ్డి, మెరిగాడి ఇందిర, కూతాటి అంజన్‌కుమార్, కర్రె వెంకటయ్య, గ్యాదపాక నాగరాజు, కూళ్ల సిద్ధులు, సీస మహేశ్వరి, మోరిగాడి సుజాత, బింగి భాను, ఎస్‌కే మహ్మద్, ఎమ్మె కళ్యాణ్, కటకం మల్లేశ్, జంగా శ్రీధర్, ఎం.సాయికుమార్, ఎన్.టింకూ, జి,.శ్రీకాంత్, తునికి గణేశ్, గణగాని సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...