ట్రాఫిక్ నియంత్రణ కోసమే సిగ్నల్స్ ఏర్పాటు


Tue,March 19, 2019 11:58 PM

-జిల్లాలో రెండు డివిజనల్ కేంద్రాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్
-రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్
భువనగిరి అర్బన్ : జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ కోసమే ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జగదేవ్‌పూర్ చౌస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్‌భగవత్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉందని, జిల్లాలో ట్రాఫిక్‌ను తగ్గించడానికి సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట కేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని, 2017లో హెచ్‌ఎండీఏ అధికారులకు ప్రపోజల్ చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగానే భువనగిరిలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బెంగళూర్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో భువనగిరిలోని జగదేవ్‌పూర్ చౌరస్తా, వినాయక చౌరస్తాల్లో రూ.35 లక్షల వ్యయంతో సిగ్నళ్లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో చౌటుప్పల్, యాదగిరిగుట్టలోనూ ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణంలోని ట్రాఫిక్‌ను బట్టి సిగ్నళ్లలో నియంత్రణ సమయం 30 సెకండ్ల నుంచి 40 సెకండ్ల వరకు ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో ట్రాఫిక్‌ను తగ్గించడానికి సిబ్బందిని పెంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్, డీసీపీ నారాయణరెడ్డి, ట్రాఫిక్ అడినషల్ డీసీపీ మనోహార్, ట్రాఫిక్ ఏసీపీ శంకర్, పట్టణ ఏసీపీ భుజంగరావు, ట్రాఫిక్ సీఐ రంగస్వామి, పట్టణ సీఐ ఎం.సురేందర్, ట్రాఫిక్ ఎస్సై నాగన్న, పట్టణ ఎస్సై అంజయ్య, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...