ఘనంగా ఆంజనేయుడికి పూజలు


Tue,March 19, 2019 11:58 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి మంగళవారం ఆకు పూజ ఘనంగా నిర్వహించారు. ఆంజనేయుడిని శ్రీచందనంతో అలంకరించారు. జిల్లేడు పూలు, తమలపాకులతో అర్చన చేశారు. ఆంజనేయ స్వామివారికి ఇష్టమైన తినుబండాగారాలను నైవేద్యంగా సమర్పించారు. వడ పప్పు, బూరెలు, అరటి పండ్లు తదితర పదార్థాలను సమర్పించి హనుమాన్‌చాలీసా పఠించారు. కార్యక్రమాలను ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్లరంగాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహునికి మంగళవారం వివిధ పూజలు దర్శనాలు అన్నదానం, ప్రసాద విక్రయాలు. శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రత పూజలతో శ్రీవారికి రూ. 39,500 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. సాంప్రదాయ నిత్య పూజలు పెద్ద ఎత్తున జరిగాయి.
శ్రీవారి ఖజానాకు రూ. 11, 15, 603 ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ.11, 15, 603, 100 రూపాయల దర్శనం టికెట్‌తో రూ.45,300 వ్రత పూజలతో రూ.39,500 ప్రసాద విక్రయాలతో రూ. 3, 72, 355 విచారణ శాఖతో రూ. 54,610, శాశ్వత పూజలతో రూ.12 వేలపాటు అన్ని విభాగాల నుంచి రూ. 11,15,603 వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...