కట్టుదిట్టంగా ఎన్నికలు నిర్వహించాలి


Tue,March 19, 2019 11:58 PM

యాదాద్రిభు వనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేసి పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. మంగళవారం డీసీపీ కార్యాలయం మీటింగ్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, జేసీ రమేశ్, రెవెన్యూ డివిజినల్ అధికారులు, ఏసీపీలు ఇతర పోలీసు అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లోకేషన్లు, పోలింగ్ కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని అన్ని బందోబస్తు ఏర్పాటు చేయాని సూచించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇతర ప్రచార కార్యక్రమాల విషయంలో సువిధ యాప్ ద్వారా రెవెన్యూ అధికారులు నుంచి అందిన వెంటనే విచారణ చేసి 48 గంటల్లోగా అనుమతికి సిఫారసు చేయాలని ఆయన పోలీసు అధికారులకు చెప్పారు. ప్రతి మండలంలో స్టాటిక్ సర్వే లెన్స్, వీడియో సర్వే లెన్స్ బృందాలు మూడు చొప్పున నిర్దేశించిన ఎన్నికల విధులు, ప్రవర్తనా నియమావళిపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ సభలు సమావేశాలు ర్యాలీలు విషయంలో సువిధ యాప్‌లను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్ ఏఆర్‌వో ద్వారానే అనుమతికి చర్యలు తీసుకోవాలని వివరించారు. మోడల్ కోడ్ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన పోలీసు, రెవెన్యూ, ఇతర అధికారులతో కూడిన బృందాలు అప్రమత్తతతో వ్యవహరించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని సూచించారు. లోకేషన్, పోలీంగ్ కేంద్రాల వారీగా బందోబస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. డబ్బులు, మద్యం అక్రమ రవాణాను నివారించి నైతికతకు ప్రాధాన్యతనిచ్చి ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...