మృత్యువులోనూ వీడని పేగు బంధం


Tue,March 19, 2019 11:58 PM

భూదాన్‌పోచంపల్లి : కన్న తల్లి రుణం తీర్చుకోలేనిదని పెద్దలమాట ఆ బందానికి విలువనిచ్చే కొడుకులు ఈ కాలంలో నూటికో.. కోటికో ఒక్కరు ఉంటారేమో కానీ తల్లి మరణవార్త విన్న ఓ కుమారుడు దాన్ని జీర్ణించులేక తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ తాను తనువుచాలించాడు. వివరాలలోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన చెరుపల్లి లలిత(70) అనారోగ్యం కారణంతో మంగళవారం ఉదయం బాత్‌రూమ్‌లో కిందపడి మరణించింది. లలితకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేందర్(50) గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటూ ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం తల్లి మరణవార్త విన్న తాను.. తన భార్యాపిల్లలతో పోచంపల్లికి చేరుకున్నాడు. తల్లి మృతి చెందడంతో ఆమె మృతదేహంపై విలపిస్తున్న క్రమంలో సురేందర్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానికి ప్రైవేట్ దవాఖానకు తరలించగా అతనికి గుండెపోటు వచ్చిందని, వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు చెప్పారు. వాహనంలో సురేందర్‌ను హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను చనిపోయాడు. తల్లి మరణవార్త విన్న కొడుకు సురేందర్ కూడా తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందడంతో ఇంటో తల్లీకుమారుని మృతదేహాలు చూసిన ప్రతిఒక్కరూ కంటనీరు పెట్టుకున్నారు. తల్లి మరణవార్త విని తన తల్లితోపాటు సురేందర్ తనువు చాలించగా అతనికి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి..
తల్లీకుమారుడి మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మంగళవారం చెరుపల్లి లలిత, సరేందర్ మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్, జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండు మధు, నాయకులు సీత వెంకటేశం, గుణిగంటి మల్లేశం గౌడ్, సీత శ్రవన్ కుమార్ తదితరులు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...