రూ.10 కోట్ల ఆస్తి నష్టం


Tue,March 19, 2019 12:44 AM

- కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- నాలుగు అగ్రిమాపక వాహనాలు 20 మంది సిబ్బందితో అదుపుతోకి తెచ్చిన మంటలు
- షార్ట్ సర్క్యూటే కారణమంటున్న కార్మికులు

భువనగిరి అర్బన్ : ఓ ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన భువనగిరి పట్టణ పరిధిలోని పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం 2 గంటలకు చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని పారిశ్రామికవాడలోని మహాసాయి ఫైన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పేయింటింగ్, నేల్ పాలీస్, వార్నిష్‌ల్లో ఉపయోగించే కెమికల్ తయారు చేస్తారు. కంపెనీలో కెమికల్ రాం మెటీరియల్ ఇథైన్, టోలీన్, మిథైల్ పంపింగ్ చేస్తున్న క్రమంలో యంత్రంలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్‌తో చిన్న చిన్న ఎగిసిపడ్డ మిరుగులు మంటలుగా వ్యాపించాయి. దీంతో అక్కడున్న సిబ్బంది మంటలను చూసి భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. అప్పటికే కంపెనీలో భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో కంపెనీ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. కెమికల్ కంపెనీలో మంటలు ఎక్కువై అందులోని ప్లాస్టిక్ డ్రమ్ములు, ఇనుప డ్రమ్ములు ఎగిరి బయటకు పడ్డాయి. అంతేకాకుండా పక్కన ఉన్న మ్యాట్రిసెస్ కంపెనీలోకి మంటలు వ్యాపించాయి.

దీంతో మ్యాట్రిస్ కంపెనీ రేకులు, మ్యాట్రిసెస్‌లో వాడె కాయర్, ఫోం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలిసిన భువనగిరి అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపుచేయడం కోసం ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై నాలుగు అగ్నిమాపక వాహనాలతోపాటు 20 మంది సిబ్బంది ఆదివారం రాత్రి 2 గంటల నుంచి సోమవారం ఉదయం 9.30 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కంపెనీలో ఉన్న కెమికల్స్, రా మెటీరియల్స్, మోటార్లు, ప్లాస్టిక్, ఇనుప ట్యాంకులతోపాటు వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటి విలువ సుమారు రూ.9 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కంపెనీ ఎండీ నగేశ్ తెలిపారు. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పేందుకు వచ్చిన ఉమ్మడి జిల్లా అగ్నిమాపక అధికారి వై.నారాయణ, భువనగిరి అగ్నిమాపక కేంద్రం అధికారి అశోక్, చౌటుప్పల్ ఫైర్ స్టేషన్ అధికారి శ్రీశైలం, ఫైర్ సిబ్బంది 20 మంది ఉన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన వారిలో భువనగిరి పట్టణ సీఐ సురేందర్, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు, భువనగిరి ఎస్సైలు ఆంజనేయులు, రాజులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...