దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి


Tue,March 19, 2019 12:44 AM

ఆలేరు టౌన్ : అకారణంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలేరు పట్టణానికి చెందిన జూకంటి బీరప్ప అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆదివారం ధర్నా నిర్వహించారు. వివరాలకు వెళ్తే.. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి అనుకొని ఉన్న ఆలేరు ఎంపీపీ కార్యాలయం పక్కన ఉన్న రోడ్డుపై పెళ్లి బస్సు ఆపారు. అక్కడకు చేరుకున్న జూకంటి బీరప్ప కుటుంబ సభ్యుల ద్విచక్ర వాహనాకి బస్సు అడ్డంగా ఉండటంతో బస్సును పక్కకు తీయమని వారిని అడిగారు. బస్సులో ఉన్నవారు మద్యం మత్తులో ఉండటంతో బీరప్ప కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దానితో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఇరువురిని శాంతింపజేసి వారిని పంపించాడు. ఈ ఘర్షణలో తమకు తీవ్రగాయాలు అయ్యాయని, బంగారం పోయిందని బీరప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అసలు దోషులను రక్షించేందుకు తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని బీరప్ప నిరసిస్తూ సోమవారం ఉదయం పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ను వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వారి ఆవేదన విని బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని, దాడికి పాల్పడ్డవారిపై కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం బాధితులు ధర్నా విరమించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...