ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం


Tue,March 19, 2019 12:43 AM

రాజాపేట : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పాముకుంటకు చెందిన చిందం లక్ష్మి అనారోగ్య కారణంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.3 లక్షల ఎల్‌వోసీని హైదరాబాద్‌లో ఆయన బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం సహాయ నిధి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం కనకయ్య, ఎండీ యాకూబ్ తదితరులున్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...