ఏప్రిల్ 16న పాలీ సెట్-2019 ప్రవేశ పరీక్ష


Tue,March 19, 2019 12:42 AM

మోటకొండూర్(యాదగిరిగుట్టటౌన్) : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యాదగిరిగుట్టలో 2019-2020 విద్యా సంవత్సరానికి గాను ఏప్రిల్ 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2019 (పాలీ సెట్) నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ షఫియాజ్ అక్తర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు వాసిన విద్యార్థులు అర్హులు అని తెలిపారు. పరీక్ష రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.400 ఉంటుందని, దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 4న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గత విద్యార్థులు ఈ సేవా లేదా మీ సేవాల కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...