తొలి రోజు నామినేషన్లు జీరో


Tue,March 19, 2019 12:42 AM

నీలగిరి : దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు మొదటి నోటిపికేషన్ విడుదల చేసిన నేపధ్యంలో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగనుండటంతో ఇందులో మూడు రోజులు సెలవు దినాలు కావడంతో కేవలం 4 రోజులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుంది. సెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో మార్చి 21న హోళీ, 23న 4వ శనివారం, 24న ఆదివారం కావడంతో నామినేషన్లను తీసుకోవడం జరగదు. కేవలం పని దినాల్లో మాత్రమే నామినేషన్లు తీసుకోవడానికి వీలుండటంతో కేవలం 4 రోజులు మాత్రమే నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుంది.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...