గులాబీ జెండా ఎగరేస్తాం


Sun,March 17, 2019 11:15 PM

-కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమే
-20 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఐదేండ్లలో చేశాం
-భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
-దామెరలో టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం
చౌటుప్పల్ రూరల్ : భువనగిరి ఖిల్లాపై మరోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు పనిచేయాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. దామెరలోని శ్రీ బాలాజీ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలపై తన గెలుపుపై చేపట్టాల్సిన కార్యక్రమాలను ముఖ్యకార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. 20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. తాను ఎంపీగా ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, అండర్‌పాస్ బిడ్జీలు, పాస్‌పోర్టుకేంద్రం, సీసీరోడ్లు, జాతీయరహదారులు, అభివృద్ధి పనులు చేపట్టిన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు.

దీంతో16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్ కీలకం అవుతుందన్నారు. తద్వారా రాష్ర్టానికి కేంద్ర నిధులు అధికంగా వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎమ్మెల్యే పదవి ప్రజలు కట్టబెట్టింది ఛాలెంజ్‌లకు కాదని రాజగోపాలరెడ్డి ఇటీవల అన్న మాటాలను ఆయన తిప్పికొట్టారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి,రెండు సార్లు మంత్రి పదవి చేపట్టి నల్లగొండకు చేసిన అభివృద్ధి ఏదని ఆయన విమర్శించారు. నల్లగొండ వ్యాపార వాణిజ్యరంగాల్లో 20 ఏండ్లు వెనక్కిపోయిందన్నారు. అప్పట్లో ఏమి లేని ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కార్పొరేషన్‌గా ఏర్పడి అన్ని రంగాల్లో ముందజలో ఉన్నాయన్నారు. నల్లగొండ ఒక పరిశ్రమ లేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని ఎంపీ పేర్కొన్నారు. దానికి కోమటిరెడ్డి బ్రదర్స్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు.

మోసపూరిత మాటలను నమ్మొద్దు

ప్రజలు మోసపూరిత మాటాలను మరోసారి నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే కూసకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా అభివృద్ధికి ఓట్లేయ్యాలన్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సత్తాచాటాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఐదేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించి ఎంపీ నర్సన్నకు కానుక ఇస్తానన్నారు. అభివృద్ధి నిరోధకులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

నల్లగొండలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ఈప్రాంత ప్రజలు గుర్తించారన్నారు. అలాంటిది పునరావృతం కాకుండా ప్రజలు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు పెద్దిటి బుచ్చిరెడ్డి, బొల్ల శివశంకర్, వివిధ సంఘాల నాయకులు కత్తుల లక్ష్మయ్య, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, కె.జగ్రాంనాయక్, చింతల దామోదర్‌రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, కొత్త పర్వతాలు యాదవ్, పందుల శంకరయ్యగౌడ్, ఊడుగు మల్లేశంగౌడ్, కందకట్ల భిక్షపతి, తడక కిరణ్, రహీం పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...