సాహిత్యం సమాజాన్ని మేల్కొల్పాలి


Sun,March 17, 2019 11:12 PM

భువనగిరి టౌన్ : సాహిత్యం సమాజాన్ని మేల్కోలిపేదిగా ఉండాలని ప్రముఖ సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపి అన్నారు. పట్టణంలోని పశుసంవర్థకశాఖ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన జిల్లా రచయితల సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. జిల్లా పరిధిలోని కవులందర్నీ ఒక్కచోటికి చేర్చి జిల్లా సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం ప్రశంసనీయమన్నారు. సమకాలీన సమాజాన్ని గమనిస్తూ ఆ దిశగా కవులు తమ కళాలకు పదును పెట్టాలని సూచించారు. ఉద్యమాలకు పురిటిగడ్డ భువనగిరి అని తెలంగాణ సాయుధ పో రాటం మొదలు తొలి,మలి ఉద్యమాల్లో ముఖ్యభూమిక పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమాల్లో కవులు, కళాకారులు బలమైన గొంతుక వినిపించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. జిరసం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య మాట్లాడుతూ.. నిస్వార్థంగా ఎవరికీ లొంగకుం డా ప్రజల పక్షాన రచనలు చేయాలన్నారు. రాజ్యానికి తొత్తులుగా మారి రచనలు చేయకూడదని, ప్రజల పక్షాన నిలిచి చేసే రచనలు చిరస్థాయిగా మిగిలిపోతాయన్నారు.

ఈ సందర్భంగా నల్లధనం మహాప్రశ్నలు యూ టూబ్ పాట ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఆల్ సీ నియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శెట్టి బాలయ్యయాదవ్, ఆచార్య ఎన్.గోపి, కూరెళ్ల విఠలాచార్య, డాక్టర్ పోరెడ్డి రంగయ్యలను శాలువాలతో సత్కరించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పోరెడ్డి రంగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కాసుల లింగారెడ్డి, ప్రముఖ గేయకవి అభినయ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి గుడిపెల్లి వీరారెడ్డి, రచయితలు, కవులు కాసుల ప్రతాపరెడ్డి, చిక్కా రామదాసు, శ్రీపాద శివప్రసాద్, గడ్డం నర్సింహారెడ్డి, శ్రీచరణ్, అరవిందరాయుడు, పెసరు లింగారెడ్డి, వాకిటి రాంరెడ్డి, బండారు జయశ్రీ, లింగా అరుణమ్మ, కాచరాజు జయప్రకాశ్, రాగి సహాదేవ్, పత్తిపాటి రమణాకర్, శెట్టి బాలయ్యయాదవ్, గట్టు రవి, సోమసీతారాములు, దిడ్డి బాలాజీ, శ్రీనివాస్, శిఖాగణేశ్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...