ఆకట్టుకున్న మహాసభలు


Sun,March 17, 2019 11:12 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. జనగామకు చెందిన శ్రీచంద్రకళానిలయం రుక్మిణి బృందంలోని కె. రుక్మిణి, జి.సంధ్య, కె.నిత్య, కె.రుతిక, అయిషిత, బి.శ్రావణి, నివిధ, కీర్తిక, సహస్ర, హర్షిణి, సహర్షిత, శృతి, చైతన్య, అనుశ్రీ అద్భుతంగా కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. వినాయక గద్యం, పుష్పాంజలి, సంధ్యాతాండవం, శివతాండవం, జూగల్‌బండి, చతురస్ర జ్యాతి, అన్నమాచార్య కీర్తనలపై చేసిన నృత్యాలు హైలెట్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా మాస్టర్ పేరిణి సంతోష్‌ను ఆలయ విద్వాంసులు ఘనంగా సన్మానించారు. ఉదయం సాయిబాబా సేవాసమితి వారు భజన కార్యక్రమం నిర్వహించారు.

అత్యద్భుతంగా భగవన్నామ స్మరణ చేస్తూ భక్తులను అనందభరితులను చేశారు. విశ్వాంజనేయ భక్త సమాజము భజన మండలి వారు భజన కార్యక్రమం ఆకట్టుకుంది. భాస్కరభట్ల ఆంజనేయ శర్మ ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. గజేంద్రమోక్షం, అంబరీశ ఉపాఖ్యానములోని కొన్ని ఘట్టములను ఉదహరిస్తూ శరణాగతుడైన భక్తులను పరమాత్మ రక్షిస్తాడని చక్కగా వివరించారు. మడమల రాంబాబు భాగవతార్ భక్త ప్రహ్లాద హరికథా పరాయణం చేశారు. నిలయ విద్వాంసులు వాయిద్య సహకారం అందించారు. దరూరి వంశీకృష్ట, జయాబృందం భక్తిసంగీతం నిర్వహించారు. మహతి ఆర్ట్స్, డి.వి.మోహనకృష్ణ కర్ణాటక సంగీతం నిర్వహించారు. శ్రీచక్రడాన్స్ అకాడమీ నృత్య ప్రదర్శన సభికులను అలరించింది. వరంగల్ నటరాజ నాట్య కళావేదిక వారు కూచిపూడి నృత్యంలో భక్తులు పరవశించి పోయారు. నిలయ విద్వాంసులు వాయిద్య గోష్ఠి ఆస్థానం వారు నిర్వహించారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...