సజావుగా ఎన్నికల నిర్వహణ


Sun,March 17, 2019 11:12 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. షెడ్యూల్డ్ విడుదలై సోమవారం నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదివారం కలెక్టరేట్‌లో ఎన్నికల మీడియా సెంటర్‌ను ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రవర్తన నియామవళిని పాటించాలన్నారు. ఇందుకోసం స్టాటిక్, వీడియా సర్వేలెన్స్ ఫ్లయింగ్ టీముల ద్వారా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రభుత్వ సెలవుదినాలు మినహా ఈ నెల 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థితో కలిపి ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోని అనుమతిస్తారన్నారురు. వాహనాలు, ర్యాలీలు, సభలు సమావేశాల విషయంలో అనుమతి పొందాలని సింగిల్ విండో విధానం ద్వారా ప్రాధాన్యత క్రమంలో అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ అన్నారు. నామినేషన్ల సమయంలో 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేయాలని కోరారు. ఎస్సీ, ఎస్ట్టీ అభ్యర్థులు రూ.12, 500, ఇతరులు రూ. 25,000 సెక్యూరిటి డిపాజిట్ చేసి నామినేషన్ ఫారంతో అందచేయాలని కోరారు. నామినేషన్ వేయడానికి ముందురోజు బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి వివరాలు పొందుపరచాలని నామినేషన్ ఫారంలో అన్ని కాలాలు విధిగా పూరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి
ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు వేయాలని కలెక్టర్ ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా చునావో పాఠశాలలు నిర్వహించి ఈవీఎం, వీవీపాట్లపై కాబోయే ఓటర్లు, ప్రస్తుత ఓటర్లును గ్రూపులుగా చేసి అవగాహన నిర్వహించామన్నారు. మరో 153 హాబిటేషన్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగియగానే క్లోజ్ బటన్ నొక్కని ఘటనలు 1,2 నమోదు అయినందున ఈసారి పీవో, ఏపీవోలకు సమర్థవంతగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో భువనగిరి పట్టణ ప్రాతంలో 20 పోలింగ్ కేంద్రాల్లో 75 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదు అయినందున వాటిని గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫారం-7 ఇచ్చి డూబ్లికేట్ ఓటర్లను బీఎల్వోల సహకారంతో తొలగించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎథికల్ ఓటింగ్‌పై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఓటర్లు ప్రలోబాలకు గురికాకుండా చూసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.

పిల్లల ద్వారా తల్లిదండ్రులకు నచ్చజెప్పే కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి చేపట్టినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాట్లాడుతూ పోలీస్, డ్త్రెవర్లు, వెబ్ కాస్టింగ్ నిర్వహించే పిల్లలకు, విధి నిర్వహణలో ఉన్న ప్రతి సిబ్బంది ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్, ఫారం-12 ద్వారా ఈడీసీతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్, తాగునీరు, దివ్యాంగులకు ర్యాంపులు , వీల్ చైర్స్, ఆటోలు ఏర్పాటుకై అన్ని చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్‌మెంట్లలో కలిపి 40952 మంది దివ్యాంగులను గుర్తించామన్నారు. సి-విజల్ యాప్ ద్వారా మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు అందజేయవచ్చని ఇందుకోసం ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 1950 టోల్ ఫ్రీ నెంబర్‌తో కాల్ సెంటర్ పనిచేస్తుందని కలెక్టర్ వివరించారు.

స్పెషల్ ఆఫీసర్ ప్రియాంక మాట్లాడుతూ.. సువిధ యాప్ ద్వారా మోడల్ కోడ్ ఉల్లంఘన జరిగినచో ఫొటో తీసి పంపవచ్చని సంబంధిత మోడల్ కోడ్ బృందాలు వెళ్లి 100 నిమిషాల్లోనే తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. కొన్ని చోట్ల వెబ్‌లైవ్ కెమెరాలు, మరికొన్ని చోట్ల ఆఫ్‌లైన్ రికార్డింగ్, కొన్ని చోట్ల పరిశీలకులను ఏర్పాటు చేశామన్నారు. ఏసీపీ బుజంగరావు మాట్లాడుతూ.. సెక్యూరిటీ ఏర్పాట్లును వివరించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు పొందాలని, అనుమతులు లేనివారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి తుగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పటిష్ట బందోబస్తు కోసం అప్పటికే రెండు కంపెనీల కేంద్ర బలగాలు యాదగిరిగుట్ట, భువనగిరి చేరుకున్నాయని, మరిన్ని బలగాలు త్వరలో రానున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటామని వివరించారు. విలేకర్ల సమావేశంలో జేసీ రమేశ్, డీఆర్వో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...