పోలీసులు ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్


Sun,March 17, 2019 11:12 PM

భువనగిరి అర్బన్ : యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి పట్టణంలోని వైఎస్‌ఆర్ గార్డెన్ నుంచి పోలీసులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న మార్చ్ ఫాస్ట్‌ను భువనగిరి ఏసీపీ భుజంగరావు జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్‌ఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమై పట్టణంలో ప్రధాన రహదారి వెంట నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పారా మిలిటరీ, పోలీసులు భాలగాలతో మార్చ్‌ఫాస్టు, కవాతు నిర్వహిస్తున్నాట్టు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రాలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సురేందర్, 150 మంది సిబ్బంది పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...