పూల రవీందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి


Sun,March 17, 2019 11:11 PM

భువనగిరి టౌన్ : రాబోయే నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గండమల్ల విశ్వరూపం అన్నారు. పట్టణంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జీవో నెం.15 విడుదలలో పూల రవీందర్ పాత్ర కీలకమన్నారు. జీవో నెం.15తో రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 8630 మంది భాషాపండితులకు, 1849 మంది పీఈటీలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు తమకు అవకాశం కల్పించాలని కోరుతూ జీవో నెం.15పై కోర్టులో కేసు వేయడంతో కోర్టు స్టే విధించిందని చెప్పారు. ప్రభుత్వం స్టేను ఎత్తివేయించి భాషా పండితులకు, పీఈటీలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. రాబోయే ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్‌కు మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు కందుల ఉపేందర్, రాష్ట్ర కోశాధికారి అయితగోని వెంకటేశ్వర్లు, పీఈటీ టీఎస్ జిల్లా అధ్యక్షుడు నాతి కృష్ణమూర్తి, ప్రధానకార్యదర్శి ఎస్.వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాతి మల్లేశం, నాయకులు మధుసూదన్, దర్శనం, వెంకన్న, నాగమల్లు, మండల స్వామి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...