కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన


Sun,March 17, 2019 11:11 PM

భువనగిరి టౌన్ : ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గ్లొబల్ కంటి దవాఖాన సౌజన్యంతో పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని సంఘం అధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో 50మంది పరీక్షలు నిర్వహించి 10 మందిని ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కార్యక్రమంలో నాయకులు తాడూరి కిష్టయ్య, రేఖల ఆనందం, కె.గోపాల్, సుధాకర్, దావూద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...