సాఫీగా పదోతరగతి తెలుగు పరీక్ష


Sun,March 17, 2019 12:02 AM

భూదాన్‌పోచంపల్లి: మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం కాగా మొదటి రోజు తెలుగు పేపర్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం మండలంలో మూడు పరీక్షా కేంద్రాల్లో 787 మందికిగాను ఇద్దరు విద్యార్థులు గైర్హాజరుకాగా 785 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు మొత్తం 34 మంది ఇన్విజిలేటర్లు, మగ్గురు ఇపార్ట్‌మెంటల్ అధికారులు, మగ్గురు చీఫ్ సూపరిండెంట్‌లు విధులు నిర్వహించారు. మొదటి రోజు పరీక్షలు కావడంతో దాదాపు విద్యార్థులందరూ అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. ఇక దూర గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం సరైన సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోల్లో బైక్‌ల పైన పరీక్ష కేంద్రానికి సకాలంలో హాజరయ్యారు. విద్యార్థులు అందరూ ప్రశాంతంగా పరీక్షలు రాశారు.
వందశాతం హాజరు..
వలిగొండ: వలిగొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి తెలుగు పరీక్షకు వందశాతం విద్యార్థులు హాజరైనట్లు నాలుగు పరీక్ష కేంద్రాల్లో 744 మంది విద్యార్థులకు ఏ ఒక్క విద్యార్థి ఆఫ్‌సెంట్ కాలేదని మండల విద్యాధికారి విజయరావు శనివారం తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...